Prabhas : సీడెడ్ లో ‘సలార్’ కి బయ్యర్స్ కరువు.. నిర్మాతకి విడుదలకు ముందే భారీ నష్టం..!

- Advertisement -

Prabhas : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై ఇంత బజ్ రావడానికి కారణం అయ్యింది. దానికి తోడు రీసెంట్ గా విడుదలైన టీజర్ కి కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ రావడం తో ఫ్యాన్స్ ఈ చిత్రం పై కోటి ఆశలు పెట్టుకున్నారు.

Prabhas
Prabhas

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవ్వడం ఈ చిత్రం పై ఈ స్థాయి అంచనాలను పెట్టుకునేలా చేసింది. ఈ చిత్రం తో ప్రభాస్ కచ్చితంగా పాన్ ఇండియా వైడ్ అన్నీ భాషలకు కలిపి వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొడుతాడనే నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ పండితులు సైతం.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యింది. అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు 5 లక్షల డాలర్స్ ని వసూలు చేసింది. ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తే ప్రీమియర్స్ లో ఈ సినిమా కచ్చితంగా మూడు మిలియన్ డాలర్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన సీడెడ్ బిజినెస్ మాత్రం అనుకున్న రేంజ్ లో జరగడం లేదు.

- Advertisement -

నిర్మాతలు ఆ ప్రాంతానికి గాను 40 కోట్ల రూపాయిలను డిమాండ్ చేస్తున్నాడట. కానీ బయ్యర్స్ ససేమీరా ఒప్పుకోవడం లేదు. దీనితో నిర్మాత వెనక్కి తగ్గి 27 కోట్ల రూపాయలకు ఇస్తామని ఆఫర్ చేసినా నో చెప్తున్నారు. ప్రభాస్ గత చిత్రాలన్నీ ఈ ప్రాంతం లో భారీ నష్టాలను తెచ్చిపెట్టడమే అందుకు కారణం అట. అయితే ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళే మన రేట్ కి వస్తారులే అనే నమ్మకం తో ఉన్నారట మేకర్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com