Lavanya Tripathi : టాలీవుడ్ లో చూడచక్కగా , తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే హీరోయిన్స్ లో ఒకరు లావణ్య త్రిపాఠి. ఈమె తెలుగు అమ్మాయి కాదు , కానీ అచ్చు గుద్దినట్టు తెలుగు అమ్మాయిలాగానే అనిపిస్తుంది. ‘అందాల రాక్షసి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా లావణ్య త్రిపాఠి, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి.
అలా అవకాశాలు వస్తున్నాయి కదా అని తన పరిధి ని ఏమాత్రం కూడా దాటకుండా, సంసారం పక్షంగా ఉండే పాత్రలను మాత్రమే పోషిస్తూ ముందుకెళ్ళేది. అందుకే ఆమెని అందరూ ఇష్టపడుతారు, అలా ఆమెని వరుణ్ తేజ్ ఇష్టపడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకొని రీసెంట్ గానే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అతి త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో డిసెంబర్ లేదా నవంబర్ నెలలో పెళ్లి చేసుకుంటామని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే రొమాంటిక్ సీన్స్ మరియు సాంగ్స్ కి సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసే లావణ్య త్రిపాఠి మంచు విష్ణు హీరో గా నటించిన ‘దూసుకెళ్తా’ చిత్రంలోని ఒక పాటలో రొమాన్స్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే లావణ్య త్రిపాఠి ఒప్పుకొని చెయ్యడానికి సిద్ధమైనా, మంచు విష్ణు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడట. ఫారిన్ లొకేషన్ లో సమ్మర్ లో ఈ షూటింగ్ ని చేశారట.
ఎండలో డ్యాన్స్ వేస్తూ లావణ్య తో రొమాన్స్ చెయ్యడానికి ఆయన నరకం చూసినట్టుగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలు మానేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందుకు ఒప్పుకుంటేనే పెళ్లి అన్నట్టుగా వరుణ్ తేజ్ గతం లో కండీషన్ పెట్టినట్టు వార్తలు వినిపించాయి.