Jr NTR : చిరంజీవి ని తిట్టినందుకు జూనియర్ ఎన్టీఆర్ అతనితో సినిమాలు చెయ్యడం ఆపేసాడా..?

- Advertisement -

Jr NTR : మెగాస్టార్ చిరంజీవి కి నేటి తరం స్టార్ హీరోలలో అప్పట్లో ఒక రేంజ్ పోటీని ఇచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆరోజుల్లో ఎన్టీఆర్ మరియు చిరంజీవి సినిమాల మధ్య పోటీ మామూలు రేంజ్ లో ఉండేది కాదు. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో నందమూరి ఫ్యామిలీ లో బాలయ్య బాబు బాగా వెనకపడిన సమయం లో ఎన్టీఆర్ ‘ఆది’ చిత్రం తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు.

Jr NTR
Jr NTR

అప్పటి నుండి నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ని బాగా ఆదరించాడా మొదలు పెట్టారు, చిరంజీవి కి పోటీ అనే రేంజ్ లో ప్రాజెక్ట్ అయ్యాడు ఎన్టీఆర్. అయితే వీళ్లిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రమే కాదు, నిజ జీవితం లో కూడా కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది అని అభిమానుల్లో ఒక అపోహ ఉండేది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ అపోహలు దూరం అయ్యాయి.

ఇక రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన వీళ్లిద్దరి మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో తెలియచేస్తుంది. అదేమిటంటే రీసెంట్ గా చిరంజీవి వైసీపీ ఎంపీ పై చేసిన కొన్ని కామెంట్స్ కి వైసీపీ పార్టీ నాయకులూ మెగాస్టార్ పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి వారిలో కొడాలి నాని కూడా ఉన్నాడు. ఈయన చిరంజీవి పై చాలా ఘాటు విమర్శలు చేసాడు, దీని పై ఎన్టీఆర్ చాలా సీరియస్ అయ్యాడట.

- Advertisement -

‘నిన్ను పబ్లిక్ ఎక్కువగా నా స్నేహితుడిగానే గుర్తిస్తూ ఉంటారు, కాబట్టి ముందు వెనుక చూసుకొని మాట్లాడు,చిరంజీవి గారిని అంత పెద్ద మాటలు అంటావా, ఇక నుండి నా సినిమాలకు సంబంధించిన కాంట్రాక్ట్స్ నీకు ఇవ్వను’ అంటూ వార్నింగ్ ఇచ్చాడట. ఎన్టీఆర్ అలా కోటింగ్ ఇవ్వబట్టే చిరంజీవి ని నేను ఏమి అనలేదు అంటూ కొడాలి నాని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు అని అంటున్నారు విశ్లేషకులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here