భక్తి పాటని కాస్త ఐటెం సాంగ్ చేసేసారుగా.. టాలీవుడ్ పరువు తీసేసిన ప్రభాస్!

- Advertisement -

రీమేక్ చెయ్యడం అనేది మన టాలీవుడ్ లోనే కాదు,ఏ ఇండస్ట్రీ లో అయినా కొత్తగా వచ్చిన సంప్రదాయం కాదు. ఎన్టీఆర్ కాలం నుండి జరుగుతూనే ఉంది. మంచి సినిమా అనిపించినప్పుడు దానిని రీమేక్ చెయ్యడంలో ఎలాంటి తప్పు లేదు. మంచి కంటెంట్ అన్నీ బాషలలో రీచ్ అవ్వాలి, అప్పుడు దానికి విలువ ఉంటుంది. రీమేక్ చెయ్యడం అనేది కూడా చిన్న విషయం కాదు, మాతృక లో ఫీల్ ఏమాత్రం మిస్ అవ్వకుండా తియ్యడం అంటే కత్తి మీద సాము లాంటిది.

రీమేక్ చేసి హిట్ కొట్టకపోయిన పర్వాలేదు కానీ, మాతృక ని ఖూనీ చెయ్యకుండా ఉంటే చాలు. కానీ ప్రభాస్ అలాంటి పనే చేసాడు. అసలు విషయం లోకి వెళ్తే అప్పట్లో కన్నడలో శివ రాజ్ కుమార్ హీరో గా నటించిన జోగి చిత్రం సంచలన విజయం సాధించి కన్నడ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.

1995 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా సుమారుగా 61 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. అలాగే ఆరోజుల్లోనే 30 కోట్ల రూపాయలకు పైగా రాబట్టిన మొట్టమొదటి కన్నడ చిత్రం గా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతోనే కన్నడలో ఉదయం 8 గంటల ఆటల ట్రెండ్ ప్రారంభం అయ్యిందట. విడుదలకు ముందు ఈ సినిమాలోని పాటలు కర్ణాటక రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసింది. ఎక్కడ చూసిన ఈ సినిమాలోని పాటలే, వాటిల్లో ముఖ్యంగా ‘ఎల్లో జోగప్ప’ అనే పాట సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.

- Advertisement -

ఈ పాట భక్తి గీతంగా ప్రసిద్ధి చెందింది, ఈ పాటలో శివ రాజ్ కుమార్ శ్రీ రాముడిగా, శివుడిగా ఆ తర్వాత చివరికి సన్యాసిగా కనిపిస్తాడు. అంత భక్తి తో నిండిన ఈ పాటని తెలుగులో ‘ఓరోరి యోగి నన్ను కొరికేయారో’ అంటూ ఐటెం సాంగ్ గా మార్చేశారు. రీసెంట్ యోగి చిత్రం రీ రిలీజ్ అవ్వగా , ఆ సినిమాకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ పాటకి మాతృక పాటని అప్లోడ్ చేసారు. అప్పుడు అర్థం అయ్యింది అందరికీ భక్తి పాటని కాస్త ఐటెం సాంగ్ లాగ మార్చేసారా అని. ‘జోగి’ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ ‘యోగి’ చిత్రం అప్పట్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here