తెలుగు సినీ పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు మాత్రమే పరిమితం అయ్యింది, కేవలం వీళ్ళు మాత్రమే ఇండస్ట్రీ ని శాసిస్తున్నారు, కొత్తవాళ్లను తొక్కేస్తున్నారు అంటూ కొంతమంది సినీ పెద్దలు ఆరోపిస్తూ ఉంటారు. నేటి తరం లో కూడా నాని , రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి సక్సెస్ అయ్యారు కదా , ఇంకా ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని మనకి అనిపించొచ్చు.
కానీ అలాంటి వాళ్ళు కేవలం కొంతమంది మాత్రమే అదృష్టం కలిసొచ్చి సక్సెస్ అయ్యారు, కానీ ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ మాత్రం అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. వాళ్లకి అలా అవకాశాలు రానివ్వకుండా చేస్తుంది కూడా ఇండస్ట్రీ లో ఆ నాలుగు కుటుంబానికి సంబంధించిన వాళ్ళే అని అంటున్నారు. అలా వరుణ్ సందేశ్ కెరీర్ ని కూడా అక్కినేని నాగార్జున తొక్కేసాడని గత కొద్ది రోజుల క్రితం నుండి సోషల్ మీడియా లో ఒక వార్త తెగ ప్రచారం సాగుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్కినేని నాగ చైతన్య మరియు సుకుమార్ కాంబినేషన్ లో అప్పట్లో 100 % లవ్ అనే చిత్రం విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ ముందుగా నాగ చైతన్య తో చెయ్యాలని అసలు అనుకోలేదు, వరుణ్ సందేశ్ తో చేద్దాం అనుకున్నాడు. ‘హ్యాపీ డేస్’ , ‘కొంత బంగారు లోకం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ అవకాశం వచ్చింది. ఒక్కసారి ఊహించుకోండి?, వరుణ్ సందేశ్ ఆ రెండు సూపర్ హిట్స్ ఊపు లో ఈ క్రేజీ సినిమా కూడా చేసి ఉంటె అతని కెరీర్ ఎలా ఉండేదో?, అంత మాట్లాడుకొని ఓకే అనుకున్న తర్వాత గీత ఆర్ట్స్ నుండి కాల్ వచ్చింది.
నాగార్జున గారు నిన్ను ఇంటికి పిలుస్తున్నాడు అని చెప్పారట. అప్పటికే రాత్రి 9 గంటలు అయ్యింది, నాగార్జున లాంటి స్టార్ పిలిచినా తర్వాత వెళ్లకుంటే బాగుండదు అని వెళ్ళాడట. ఇంటికి వెళ్ళగానే నాగార్జున నీ దగ్గర ఎదో మంచి లవ్ స్టోరీ ఉంది అంట కదా , అరవింద్ గారు చెప్పారు,అది నాగ చైతన్య తో చెయ్యండి అని అన్నాడట. వరుణ్ సందేశ్ తో ఆ ప్రాజెక్ట్ అప్పటికే ఫిక్స్ అయిపోయింది అని చెప్పినా కూడా, ఆ అబ్బాయితో వేరే సినిమా చెయ్యి, ఇది మాత్రం నాగ చైతన్య తోనే చేయలని నాగార్జున పట్టుబట్టాడట. అలా 100 % లవ్ చిత్రం వచ్చింది. ఆ ఒక్క రాత్రి వరుణ్ సందేశ్ కెరీర్ ని తలక్రిందులు చేసింది. ఒకవేళ ఆ సినిమా ఒప్పుకొని చేసి ఉంటే ఈరోజు వరుణ్ సందేశ్ వేరే రేంజ్ లో ఉండేవాడు.