నిన్నటి తరం హీరోలలో విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఆయన ఫ్యామిలీ ఆడియెన్స్ ఫాలోయింగ్ ని మ్యాచ్ చేసే ఇంకా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టలేదు. ఇప్పటికీ ఆయన సినిమా వచ్చిందంటే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేస్తారు, హిట్ అయితే స్టార్ హీరోలతో సరిసమానంగా వసూళ్లు వస్తున్నాయి ఇప్పటి వరకు ఆయన 74 సినిమాలు చేస్తే అందులో అధికశాతం సూపర్ హిట్ సినిమాలే ఉన్నాయి.
అందుకే ఆయనని అందరూ విక్టరీ వెంకటేష్ అని పిలుస్తూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీ లో ఉన్నంత కాలం గాసిప్స్ కి దూరంగా ఉన్న సెలబ్రిటీ అంటూ ఎవ్వరూ లేరు. కానీ విక్టరీ వెంకటేష్ మాత్రం తెల్లని కాగితం లాంటి వాడు , ఆయన మీద ఎలాంటి రూమర్స్ లేవలేని అందరూ అనుకోవచ్చు, కానీ ఆయన మీద కూడా అప్పట్లో ఎన్నో రూమర్స్ వచ్చాయి.
ఇది ఇలా ఉండగా విక్టరీ వెంకటేష్ సినిమాల ద్వారా టాలీవుడ్ కి ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు అనే విషయం అందరికీ తెలిసిందే , వారిలో ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు. ఈమె వెంకటేష్ తో కలిసి మొట్టమొదటిసారిగా ‘నువ్వు నాకు నచ్చావ్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమెకి తొలిసినిమా, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంవత్సరం లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈమె వెంకటేష్ కలిసి మొత్తం మూడు సినిమాల్లో నటించింది, ఆ మూడు చిత్రాలు కూడా ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్స్ అయ్యాయి .
వాటిల్లో ‘వసంతం’ కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ఈ చిత్రం లో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ చీర కడుతాడు గుర్తుందా..? , అలా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు ఆర్తి అగర్వాల్ కి స్వయంగా ఆయనే చీర కట్టేవాడట, ఎందుకంటే ఆర్తి అగర్వాల్ కి చీర కట్టుకోవడం రాదు కాబట్టి. ఈ విషయం అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. హీరోయిన్స్ వ్యక్తిగత అవసరాల కోసం లేడీస్ లొకేషన్ లోనే ఉండగా , ఆర్తి అగర్వాల్ వెంకటేష్ తోనే చీర ఎందుకు కట్టించుకుంది అంటూ అప్పట్లో వార్తలు ప్రచారం అయ్యాయి.