టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలలో ఒకడు విజయ్ ఆంటోనీ. ఇతను హీరో గా నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన చాలా సినిమాలు చేసాడు. ఆ సినిమాలన్నిటికీ మంచి క్రిటిక్ రేటింగ్స్ అయితే వచ్చాయి కానీ, కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ అవ్వలేదు.
రీసెంట్ గా విడుదలైన ‘బిచ్చగాడు 2 ‘ మాత్రం నెగటివ్ రివ్యూస్ ని దక్కించుకున్నప్పటికీ మంచి వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రానికి దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ 15 కోట్ల రూపాయిలు, బిచ్చగాడు పార్ట్ 1 కి కూడా వచ్చింది. కానీ ఈ సినిమాకి మంచి వసూళ్లు అయితే వచ్చాయి కానీ, విజయ్ ఆంటోనీ మాత్రం బాగా నష్టపోయాడు.
ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయం లో ఒక సినిమా సినిమా చేస్తున్నాం , కచ్చితంగా జనాలకు నచ్చుతుంది అనే నమ్మకం తో అయితే విజయ్ ఆంటోనీ ఉండేవాడు కాదు, కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం అటు కోలీవుడ్ ని ఇటు టాలీవుడ్ ని దున్నేస్తుందని మాత్రం ఊహించలేకపొయ్యాడు. తక్కువ బడ్జెట్ తో 30 లక్షల్లోనే సినిమా తీసాడు. అలా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే ఒక ప్రముఖ కోలీవుడ్ నిర్మాత కోటి రూపాయిల ఆఫర్ ఇచ్చి సినిమాని నాకు అమ్మేయమని అడిగాడట.
అప్పట్లో ఇంత చిన్న సినిమాకి అది మంచి ఆఫర్ అవ్వడం తో విజయ్ ఆంటోనీ ఆ సినిమాని అమ్మేశాడు. విడుదల తర్వాత ఆ చిత్రం ఊహించని రీతిలో 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. విజయ్ ఆంటోనీ కాస్త ఓపిక పట్టి ఉంటే ఆ 50 కోట్ల రూపాయల్లో టాక్సులు , థియేటర్స్ రెంట్ , పబ్లిసిటీ ఖర్చులు పోను 40 కోట్లు అయినా మిగిలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.