Anchor Suma : యాంకరింగ్ కు సుమ గుడ్ బై.. కారణం అదేనా?

- Advertisement -

Anchor Suma : తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ యాంకర్స్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సుమ కనకాల..ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈమె మాటలు అందరినీ ఆకట్టుకుంది..ఆమె వేసే పంచులు ఇంటిల్లి పాధి అలరిస్తున్నాయి..దాంతో సుమ షోలకు మంచి డిమాండ్ వుంటుంది..ఎంత పెద్ద సెలబ్రిటి నైనా తన మాటలతో ఇరకాటంలో పెట్టే సత్తా సుమా కి ఉంది. అంతేకాదు స్టార్ హీరోలు సైతం తమ ఆడియో ఫంక్షన్లకి,ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఇంటర్వ్యూలకు కచ్చితంగా సుమా ఉండాల్సిందే అంటూ పట్టుబడతారు.అలాంటి క్రేజ్ ఉంది సుమకు..అయితే ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పనుందని వార్తలు వినిపిస్తున్నాయి..

Anchor Suma
Anchor Suma

సుమ కనకాల కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది..తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.. యాంకర్ గా ఎంతో ఎత్తుకు చేరుకుంది.. ఇప్పుడు అందరికి ఆదర్సంగా మారింది..ఈమె తర్వాతే యాంకరింగ్ లో మరొకరి పేరు వినిపిస్తోంది..ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ ఏడాది జయమ్మ పంచాయతీ అనే సినిమాలో మెయిన్ రోల్ పోషించింది. ఓ పక్క బుల్లితెర మీద ప్రసారం అయ్యే కొన్ని షోలలో యాంకర్ గా చేస్తూ అలాగే హీరోల ఆడియో ఫంక్షన్లకి, ప్రీ రిలీజ్ ఈవెంట్లకి యాంకర్ గా వ్యవహరిస్తూ మరోవైపు సినిమాల్లో కూడా చేస్తూ ఇలా బిజీబిజీగా గడుపుతోంది సుమాకనకాల.

Suma Kanakala
Suma Kanakala

ఈటీవీలో సుమ యాంకరింగ్ చేసిన స్టార్ మహిళ అనే ప్రోగ్రాం ఏకంగా నాలుగువేల ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అలాంటి సుమ తాజాగా ఒక షాకింగ్ న్యూస్ తన అభిమానులకు చెప్పింది. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. న్యూ ఇయర్ రాబోతున్న సందర్భంగా ఈటీవీ వాళ్ళు వేర్ ఈజ్ ద పార్టీ అనే ఓ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్రోగ్రాం లో యాంకర్ సుమని సన్మానించారు. ఇక వారు సన్మానించిన సందర్భంగా సుమ తన జీవితంలోని కొన్ని ఆస్తికరమైన విషయాలను అందరితో పంచుకుంది..

- Advertisement -

సుమ యాంకరింగ్ లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో కూడా చెప్పుకొచ్చింది. తనని ఇప్పటివరకు ఆదరించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెబుతూనే ఇప్పటినుండి నేను కొంతకాలం రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది సుమ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పబోతుందా అని భయపడుతున్నారు. కొన్ని రోజుల విరామం ఇవ్వాలనుకుంటుందా లేక మొత్తంగా యాంకరింగ్ కి గుడ్ బై చెబుతుందా అని మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…ఇంతకీ సడెన్ గా ఆ మాట సుమా ఎందుకు చెప్పింది అని కొందరు ఆలొచిస్తున్నారు.. దీని గురించి సుమ క్లారిటీ ఇవ్వాల్సి వుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here