చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వరుస రీమేక్‌ల పైనే దృష్టి సారించారు. కానీ వరిజినల్ హిట్ అయినా రీమేక్స్ మాత్రం ఫ్లాపులు అవుతున్నాయి. వాటి దారిలోనే తాజాగా చిరు చేసిన భోళా శంకర్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టేసింది. ఆగస్టు 11న విడుదలై ఫస్ట్ షో నుంచి ఘోరమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మొదటి షో నుంచే ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఇష్టపడడం లేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్కు కారణం జబర్దస్త్ బ్యాచ్ వల్లే అని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా హైపర్ ఆది..
భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్లు జనాలకు చిర్రెత్తించాయి. చిరంజీవి పైన అతిగా స్పీచ్ ఇవ్వడం కూడా సినిమాకు నెగిటివిటీ తెచ్చి పెట్టింది. ఎక్కువగా చిరంజీవిని పొగిడేస్తూ.. డైరెక్టర్ ని కించపరిచే విధంగా మాట్లాడడం కూడా నచ్చలేదు ప్రేక్షకులకు. ఆ డైరెక్టర్ చిరంజీవిని అన్నయ్య అని భజన చేస్తూ ఆయన హోదాను చెడగొడుతున్నారు ఇది నిజమంటూ సోషల్ మీడియాలో పలు రకాలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇదే విషయంపై సంచలనాలకు కేరాఫ్ వర్మ కూడా స్పందించారు. ఇటీవలే ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇది కూడా వివాదాలుకు తెరలేపింది. అయితే భోళా శంకర్ సినిమా డిజాస్టర్ వెనుక చిరు మాత్రమే కాకుండా డైరెక్టర్, స్క్రీన్ ప్లే, ఇతర టెక్నీషియన్ కూడా ఉంటారు. సినిమా ఫ్లాప్ అయితే అందులో హీరో సరిగా చేయకపోతే ఆయననే బ్లేమ్ చేస్తూ ఉంటారు. అయితే జబర్దస్త్ వాళ్లు మాత్రం ఈ మధ్య చిరంజీవిని అతిగా పొగిడేస్తున్నారు. పొగడ్త అనే దానికంటే కూడా అతిగా భజన చేస్తున్నారు అనేది వాస్తవం.
ఇది ఇలా ఉంటే అలాంటి పొగడ్తలకు పొంగి పోయి వారికి అవకాశాలు ఇస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా వరుస ప్లాపులలోనే సతమతమవుతున్నారు. అందుకు తోడు ఫ్రీ రిలీజ్ ప్రమోషన్స్ టాక్ లో అన్నయ్య అన్నయ్య అంటూ జబర్దస్త్ బ్యాచ్ సైతం అతి చేయడంతో పాటు ఫంక్షన్ లో చిరంజీవి ప్రవర్తన.. అంటే కీర్తి సురేష్ విషయంలో అతి చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆడియో ఫంక్షన్ కూడా ఫ్లాప్ అయి అదే ఎఫెక్ట్ సినిమా పై కూడా పడిందని ప్రచారం అవుతోంది. ఇక నుంచైనా కథల ఎంపికలో చిరు కాస్త జాగ్రత్తగా ఉండాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.