ఏమాయ చేశావే సినిమాతో ఒక్క సారిగా కుర్రాళ్ల కలల రాణిగా నిలిచింది సమంత. తీసిన ప్రతి సినిమా హిట్ కొట్టి స్టార్ స్టేటస్ అందుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లోని అన్ని భాషల్లో చేసి ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అయింది. కానీ కొన్ని వివాదాల కారణంగా మ్యారేజీ లైఫ్ కు గుడ్ బై చెప్పి కెరీర్ మీదే ఫోకస్ పెట్టింది. కొందరు చైతుతో విడాకుల తర్వాత సమంత ఓ చిన్న పని చేసినా విమర్శలు గుప్పిస్తు్న్నారు.
తాజాగా మరోసారి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు సమంతను టార్గెట్ చేశారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి. శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే ఖుషి ప్రమోషన్ బాధ్యతను మొత్తం విజయ్ దేవరకొండనే తలకెత్తుకున్నాడు. రీసెంట్గా ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సమంత హాజరు కాలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ సమంతను సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు. దీంతో సమంతకు బాగా కోపం వచ్చింది.
సమంత ఇటీవల మయోసైటిస్ వ్యాధి కారణంగా కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మెరుగైన చికిత్స కోసం తాను అమెరికాకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుంది. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రమోషన్స్ కు రాలేదన్న కారణంతో వారు విమర్శలకు దిగడం సమంతకు అసలు నచ్చలేదు. ఈ నేపథ్యంలోనే వారికి ఒక్క పోస్టుతో ఇచ్చి పడేసింది. ఈ పోస్టులో సమంత ఈ విధంగా రాసుకొచ్చింది… `మీరు సమాజం కోసం బ్రతకాల్సిన పనిలేదు. మీ గౌరవం ఏమిటో తెలుసుకోండి. మీ స్థాయిని పెంచుకోండి. మీరు మీ కోసం మాత్రమే జీవించండి. మిమ్మల్ని ప్రస్తుతం ఈ సమాజం గుర్తించకపోవచ్చు. అది అంత అవసరం కూడా లేదు. పది మందిలో ఒకరిలా కాకుండా యూనిక్ గా ఉండేలా బతకండి’ అంటూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎన్ని విమర్శలు మీ మీద వచ్చినా పట్టించుకోకుండా మీ కోసం మీరు బతకండి అంటూ వారికి వార్నింగ్ ఇచ్చింది.