మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డ్స్ తో కబడ్డీ ఆదుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ప్రస్తుతం పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్ లో చేసింది చాలా తక్కువ సినెమలే అయ్యినప్పటికీ, ఏ హీరో కూడా చేయనటువంటి పాత్రలను చేసి ఇండస్ట్రీ లో తిరుగులేని సూపర్ స్టార్ , మాస్ స్టార్ గా అవతరించాడు.

ప్రస్తుతం ఆయన శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇందులో రామ్ చాన్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తుంది. రామ్ చరణ్ ఎంత మంది హీరోయిన్స్ తో కలిసి నటించిన ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడేది చరణ్ – కాజల్ అగర్వాల్ జంటని. ‘మగధీర’ సినిమాతో ప్రారంభమైన వీళ్లిద్దరి కలయిక ఆ తర్వాత మరో మూడు సినిమాల వరకు కొనసాగింది.

అంతే కాదు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా, అయితే ఒకసారి కాజల్ అగర్వాల్ ని ఒక ఇంటర్వ్యూ లో అడిగిన ర్యాపిడ్ ఫైర్ క్వచ్చన్స్ లో ఆమె రామ్ చరణ్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు అభిమానులకు కోపం తెప్పించాయి. ఒక యాంకర్ కాజల్ అగర్వాల్ ని ప్రశ్న అడుగుతూ ‘ మీకు అవకాశం వస్తే ఏ హీరో ని చంపేసి, ఏ హీరో తో లేచిపోయి పెళ్లి చేసుకుంటావు?’ అని అడగగా, దానికి కాజల్ అగర్వాల్ సమాధానం చెప్తూ ‘రామ్ చరణ్ ని చంపేసి, ఎన్టీఆర్ తో లేచిపోయి , ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను’ అంటూ షాకింగ్ సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె సరదాకి ఈ మాటలు మాట్లాడినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అంతే కాదు తనకి ఎంతో ఇష్టమైన హీరో రానా దగ్గుపాటి అని కూడా చెప్పి అందరినీ షాక్ కి గురి చేసింది కాజల్ అగర్వాల్.