పొట్టి పొట్టి బట్టలతో ఫ్యామిలీ పరువు తీస్తున్నావు…మరోసారి ట్రోలింగ్కి గురి అవుతున్న మెగా డాటర్..

- Advertisement -

మెగా ఫ్యామిలీ ఏ విషయంలో వైరల్ అయినా అవ్వకపోయినా మెగా డాటర్స్ విషయంలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక కొణిదల డైవర్స్ విషయం సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడాకుల తర్వాత నుంచి తరచూ ఆమె చేసే ఏదో ఒక విషయం ఇంటర్నెట్లో హడావిడి చేస్తూనే ఉంది. ఆమెపై నెగటివ్గా ట్రోల్ చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది.తాజాగా నిహారిక చేసిన మరొక పని నెట్లో ఆమెపై విపరీతమైన నెగటివ్ కామెంట్స్ ను తెచ్చిపెడుతోంది.

నిహారిక కొణిదల
నిహారిక కొణిదల

మొదట సినిమాలో హీరోయిన్గా తన లెగ్ ట్రై చేసిన నిహారిక హీరోయిన్ గా సెట్ కాను అని ఫస్ట్ సినిమాతోనే ఫిక్స్ అయిపోయింది. ఇక ఆ తర్వాత తండ్రి నాగబాబు సపోర్ట్ తో ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చేపట్టింది.ఇక ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని సెటిల్ అయింది అనుకునే టైంలో ఎవరూ ఊహించని కొత్త అవతారం ఎత్తింది నిహారిక. అప్పటివరకు కాస్త ట్రెడిషనల్ గా ఉన్న నిహారిక పెళ్లి తర్వాత పొట్టి పొట్టి దుస్తులు వేసుకొని అటు అత్తింటి పరువు ఇటు పుట్టింటి పరువు రెండు తీసేసింది.

ఈ విషయంపై సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులకు పెద్ద రచ్చ జరిగింది.పెళ్లి అయిన కొన్ని నెలలకే భర్తతో గొడవలు పెట్టుకుని దూరంగా ఉంటూ వచ్చిన నిహారిక కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా విడాకుల్ని డిక్లేర్ చేసింది. డైవర్స్ కి అసలు కారణం తెలియకపోయినా పెళ్లి తర్వాత నిహారిక ప్రవర్తన మరియు ఓవర్ ఫ్రీ గా ఉండడమే ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది.

- Advertisement -

రీసెంట్ గా నిహారిక తన ఇన్స్టాలో షేర్ చేసిన పిక్స్ తిరిగి ఆమెపై ట్రోలింగ్ని పెంచాయి. పద్ధతిగా చీర కట్టుకొని బొట్టు గాజులు పెట్టుకొని ఎంతో ట్రెడిషనల్ గా ఉన్న నిహారిక ఫొటోస్ చూసి కొంతమంది బాగున్నాయి అంటే. మరి కొంతమంది ఈ బుద్ధి పెళ్లయ్యాక ఏమయింది.. అప్పుడేమో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని మెగా ఫ్యామిలీ పరువు తీశావు.. అటు హస్బెండ్ ఫ్యామిలీ ని కూడా మిస్ చేసుకున్నావు అంటూ నేటిజన్స్ ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇదే పద్ధతి పెళ్లయ్యాక కూడా మెయింటైన్ చేస్తే విడాకులు తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని ఎద్దేవా చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here