ఇంట్రెస్టింగ్ గా మహేశ్ – నమ్రత లవ్ స్టోరీ… ఫస్ట్ ప్రపోజ్ చేసిందెవరో తెలుసా?

- Advertisement -

మహేశ్ ఈ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. యువతుల కలల రాకుమారుడిగా వెలుగొందుతూ.. సూపర్ స్టార్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. అటు సినిమాల్లోనూ ఇటు ఫ్యామిలీ మేన్ గా సక్సెస్ సాధిస్తూనే ఉన్నారు మహేశ్. నిజానికి మహేశ్ నమ్రతను ఐదేళ్ల పాటు ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. హీరో హీరోయిన్లుగా నటిస్తూనే నిజజీవితంలో పెళ్లి బంధంతో ఒకటై సక్సెస్ ఫుల్గా నిలిచిన జంటలో వీరు మొదటి వరుసలో ఉంటారు. అందుకే వీరిని టాలీవుడ్ క్యూట్ కపుల్ అంటారు. వంశీ సినిమా షూటింగ్లో వీరికి పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. 2000లో విడుదలైన ఈ సినిమా అయితే హిట్ కాలేదు కానీ వారి లైఫ్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. నిన్న మ‌హేష్‌ పుట్టినరోజు సందర్భంగా వీరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మహేశ్ బాబు
మహేశ్ బాబు

లవ్ స్టోరీ విషయానికి వస్తే.. వంశీ మూవీ అవుట్‌డోర్ షూటింగ్‌ లో భాగంగా యూనిట్ అంతా కలిసి న్యూజిలాండ్ వెళ్లారట. దాదాపు 20 రోజులు పాటు షూటింగ్ నిమిత్తం అక్కడే ఉండాల్సి వచ్చిందట. వీరిద్దరి మధ్య పరిచయం కాస్త స్నేహంగా మారి అది బలపడి ప్రేమగా మారింది. ట్విస్ట్ ఏంటంటే న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత మొదట నమ్రతనే మహేశ్ బాబును అప్రోచ్ అయి ప్రపోజ్ చేసిందట. అప్పటికి నమ్రత అంటే మహేష్ కి లోలోపల ఇష్టం ఉందట. అందుకే నమ్రత ప్రపోజ్ చేయగానే లోపల లోపల సంతోషంతో వెంటనే ఓకే చేశాడట. కానీ ఫస్టలో మహేశ్ ఫాదర్ కృష్ణ అంగీకరించలేదట.

వెంటనే విషయం తన అక్క మంజులను సంప్రదించి తన సహాయం తీసుకున్నారట మహేశ్. వాస్తవానికి నమ్రత మహేష్ కంటే నాలుగేళ్లు వయసులో పెద్దదది కావడం విశేషం.. ఇండస్ట్రీకి రాకముందే నమ్రత మిస్ ఇండియా విన్నర్. దీంతో మహేష్ ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకోలేదు. అక్క మంజుల సాయంతోనే ఐదేళ్ల తర్వాత వారి పెళ్లి జరిగింది. అచ్చమైన తెలుగు సాంప్రదాయ ప్రకారం చాలా కొద్దిమంది సమక్షంలోనే సింపుల్గా మ్యారెజ్ చేసుకున్నారు. నిజానికి పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబైకి వెళ్లి అక్కడే మహేశ్ నమ్రత పెళ్లి చేసుకున్నారు. నమ్రత వచ్చిన అదృష్టమో ఏమో కానీ పెళ్లి తర్వాత మహేశ్ కెరీర్ జోరు అందుకుంది. మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here