నా పేరు నా ఇష్టం.. అనసూయకు పగిలిపోయే కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

- Advertisement -

ప్రముఖ నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కొన్ని రోజుల ముందు విజయ్‌ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసిన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఖుషి సినిమా పోస్టర్‌లో హీరో పేరు ముందు ‘THE’ అని పెట్టుకోవడాన్ని తప్పు పడుతూ ‘పైత్యం ఎక్కువైంది’ అంటూ ట్వీట్‌ చేసింది అనసూయ. దీనిపై విజయ్‌ దేవరకొండ స్పందించకపోయినా అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనసూయను ట్రోల్‌ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా దీనిపై విజయ్ దేవరకొండ స్పందించారు.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ – సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈసినిమా ట్రైలర్‌ను తాజగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ దేవరకొండ, శివ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ తన పేరు ముందు ది పెట్టడం పై మాట్లాడారు. ‘‘లైగర్‌’ సమయంలో పూరీ నాకు రెండు మూడు టైటిల్స్‌ చెప్పారు. ఆ టైటిల్స్‌తో నాకు అవసరం లేదని నా పేరు నాకు సరిపోతుందని చెప్పా. కావాలంటే ‘ది విజయ్‌ దేవరకొండ’ అని వాడమని సలహా ఇచ్చా2’’ అని విజయ్ దేవరకొండ అన్నారు.

‘‘‘ఖుషి’ నాకు విపరీతంగా నచ్చిన కథ. లవ్‌ అనే ఎమోషన్‌, లవ్‌ స్టోరీపై ఒకానొక సమయంలో నాకు చిరాకు వచ్చి చేయకూడదనుకున్నా. ‘ఖుషి’ కథ విన్నప్పుడు నాకు ప్రేమపై నమ్మకం వచ్చింది. అలాగే, గత చిత్రం పరాజయం అందుకుంది. అందుకే ఈ ప్రేమకథను ఎంచుకున్నా. ఈ సినిమా చేసినందుకు ఇప్పుడు గర్వపడుతున్నా.నా పేరుకు ముందు ట్యాగ్ ఏం తగిలించాలో అర్థం కాక.. రౌడీ హీరో, సౌత్ స్టార్ అని.. ఇలా చాలా పేర్లు పెడుతున్నారు. ‘లైగర్ ’సమయంలో నేను పూరీ జగన్నాథ్ కు ఒక్కటే మాట చెప్పాను. నాకు మా అమ్మా బాబు పెట్టిన పేరు ఉంది. అది చాలు. దానికి ముందు వెనుక ఏం తగిలించొద్దు అని చెప్పా. విజయ్ దేవరకొండ అనే వాడు ఒక్కడే ఉంటాడు. అందుకే ఎవరికి నచ్చినా నచ్చక పోయినా.. నా పేరు ముందు ‘ది’ అని పెట్టుకున్నా. ’’ అని చెప్పారు. దీంతో అనసూయకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లైంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here