Chalapathi Rao : 2022 సంవత్సరం సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచెసింది.. వరుసగా స్టార్ నటులు మరణిస్తున్నారు.. ఒకరి మరణం మరువక ముందే మరొకరు కన్నుమూస్తూ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో ముంచేస్తున్నారు. కొన్ని నెలల గ్యాప్ లోనే ఇప్పటికే చాలామంది స్టార్ నటులు మరణించారు. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ తాజాగా నటుడు చలపతిరావు కూడా కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. ఇక ఈయన మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం మరోసారి విషాదంలో మునిగిపోయింది. అయితే చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదకర సంఘటనలు ఉన్నాయట.అంతేకాదు ఒకానొక టైంలో ఆయన సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారట. ఇంతకీ ఆయన అలా చేసుకోవాలనుకోవడానికి కారణం ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
దాదాపు నాలుగు తరాల నటులతో కలిసి నటించిన అనుభవం చలపతిరావుది.. ఇండస్ట్రీలో అందరినీ చాలా ప్రేమగా బాబాయ్ బాబాయ్ అని పిలిచేవారట ఆయన.. ఎప్పుడూ పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ ఎదుటివారికి తెలియని ఎన్నో బాధలు ఆయన లోపల ఉండేవట. చలపతిరావు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తన ఇంట్లో వాళ్లకు తెలియకుండానే ఓ అమ్మాయి తనని ప్రేమిస్తుంది అని ఆమె నిర్ణయాన్ని గౌరవించి ఆయన కూడా ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ విషయంలో ఇంట్లో వాళ్ళను కూడా ఒప్పించారు. కానీ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళ జంట ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్లయ్యాక కొన్నేళ్లకే చలపతి రావు గారి భార్య అనారోగ్య సమస్యలతో కన్నుమూసింది..
ఆమె చనిపొయె సమయానికి ఆయన కొడుకుకు ఏడు ఉంటాయని అంటున్నారు. ఆమెను తలచుకుంటూ ఇన్నేళ్లూ బ్రతికారు.తన సంతానమే ఆస్తిగా భావించి వారిని మంచి ప్రయోజకులుగా చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడి వారిని ఒక మంచి స్టేజిలో నిలబెట్టారట. ఇక అల్లరి నరేష్ నటించిన సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ టైంలో ఒక మేజర్ ఆక్సిడెంట్ జరిగి చలపతి రావు గారు చాలా రోజులు వీల్ చైర్ కే పరిమితమవ్వాల్సి వచ్చిందట. చలపతిరావుని చూసి బోయపాటి శ్రీను ఇలాంటి మంచి నటుడుని ఇంటికే పరిమితం చేయద్దు అనే ఉద్దేశంతో రాంచరణ్ తో తీసిన వినయ విధేయ రామ సినిమా లో ఆయనకు అవకాశం ఇచ్చారు..
ఇది ఇలా వుండగా.. ఆ మధ్య ఆయన మీద కొన్ని రూమెర్స్ రావడం జరిగింది..మహిళలను ఉద్దేశించి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు అప్పట్లో చాలా దుమారం రేపాయి. ఇక ఆయన మాటలు చాలా వైరల్ అవ్వడంతో సమాజంలో ఈయనపై నెగటివిటీ పెరిగింది. దీంతో చాలామంది ఈయనను చాలా అసహ్యంగా విమర్శించారట. అంతేకాదు సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయట. ఇలాంటి వ్యక్తి బతికుంటే ఏంటి చేస్తే ఏంటి అని తీవ్రంగా విమర్శించారట. ఇక ఆ అవమానాలను ఎదుర్కోలేక ఒకానొక టైంలో ఆయన సూసైడ్ చేసుకోవాలని భావించారట. కానీ తన కొడుకు మాటలతో మళ్లీ తిరిగి ఆ డిప్రెషన్ నుండి బయటపడ్డారట. ఇలా ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి గుండెపోటుతో మృత్యువు ఒడిలోకి చేరారు..