ట్రిపుల్ఆర్ సినిమాకు జక్కన్న రాజమౌళి ఇంపోర్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. తన నటన, అందంతో ఇక్కడ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్రవేసుకుంది. RRR మూవీలో సీతగా నటించి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మహేశ్ భట్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అందం, చలాకీ తనంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలియా భట్ పెళ్లి టైంలో కంటే తాను బిడ్డను కన్న టైంలోనే ఎక్కువగా ట్రోలింగ్ కు గురైంది. అలియాభట్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అందుకే హడావుడి పెళ్లి చేసేసుకుంది. పెళ్లయిన ఏడునెలలకే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని రోజులు బిడ్డ ఆలనాపాలనా తీసుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. ఈ ముద్దుగుమ్మ వరుసగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో గ్యాప్ లేకుండా నటిస్తోంది.
ఏంటి నిజంగానే అలియా భట్ మూడు రోజుల్లోనే రెండు పెళ్లిళ్లు చేసుకుందా.. అన్న అనుమానం వస్తుంది కాదా.. అసలు మేటర్ ఏంటంటే అలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ని లవ్ మ్యారేజీ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సీక్రెట్ బయటపెట్టింది మరెవరో కాదు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డైరక్టర్ కరణ్ జోహార్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. అలియా భట్ – రణ్ బీర్ కపూర్ల పెళ్లి అయిన మూడు రోజులకే మళ్లీ రాఖీ ఔర్ రాణి కా ప్రేమ్ కహాని అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆ క్రమంలోనే అలియా భట్ మెడలో మళ్లీ తాళి కట్టాడు రణ్ బీర్. ఇలా కేవలం మూడు రోజుల వ్యవధిలో ఆలియా భట్ రణ్ బీర్ కపూర్లు రెండుసార్లు వివాహం చేసుకున్నారు… అంటూ కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కరణ్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.