ఈమధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాతో ప్రారంభమైన ఈ ట్రెండ్, పవన్ కళ్యాణ్ జల్సా మరియు ఖుషి చిత్రాలతో తారాస్థాయికి చేరుకుంది. ఇక ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల రీ రిలీజ్లు మాత్రమే కాదు, చిన్న హీరోల రీ రిలీజ్ లు కూడా సక్సెస్ అయ్యాయి.
రీసెంట్ గానే విశ్వక్ సేన్ మొదటి సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టించి టాలీవుడ్ లోనే టాప్ 3 చిత్రాలలో కుశ్గి మరియు సింహాద్రి తర్వాతి స్థానంలో నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రీసెంట్ గా తమిళ డబ్బింగ్ సినిమా ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ కూడా నిన్న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.
తమిళ హీరో సూర్య కి మొదటి నుండి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈమధ్య ఆయనకీ వరుసగా ఫ్లాప్స్ రావడం తో ఆయన మార్కెట్ కాస్త దెబ్బ తినింది అని అందరూ అనుకున్నారు. కానీ నిన్న విడుదలైన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ కి దక్కిన ఆదరణ చూస్తే ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అనే విషయం అందరికీ అర్థం అయ్యింది.
హైదరాబాద్ మరియు వైజాగ్ వంటి ప్రాంతాలలో ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు కోటి రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు. డిమాండ్ బాగా పెరగడం తో ఈ చిత్రానికి రెండవ రోజు అన్నీ ప్రాంతాలలో షోస్ పెంచేశారు. ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.