టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఫిదా. ఈ సినిమాలో వరుణ్ కు జంటగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించింది. ఈ సినిమాలో సాయిపల్లవి డైలాగ్స్ కు విజిల్స్ మోతమోగిపోయాయి. ఆ డైలాగ్స్ ఇప్పటికీ పాపులర్. విశేషమేమిటంటే సాయి పల్లవికి తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా. ఈ మూవీతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ పొందేందుకు సాయిపల్లవికి ఈ సినిమా పునాదిగా నిలిచింది. అయితే ఈ సినిమాకు ముందు ఫిదా కథను డైరెక్టర్ శేఖర్ కమ్ముల పలువురు స్టార్ హీరోల దగ్గరకు తీసుకుపోయాడట. కానీ అనివార్య కారణాల వల్ల వారు చేయలేకపోయారు. ఈ విషయాన్ని ఇటీవల శేఖర్ ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు.
శేఖర్ కమ్ముల ఫిదా సినిమాను అసలు సూపర్ స్టార్ మహేష్ బాబును దృష్టిలో ఉంచుకుని రాసుకున్నారట. స్టోరీని మహేశ్ బాబుకు వినిపించగా బాగా నచ్చిందన్నారట. కథ నచ్చిన అప్పటికే కమిట్ అయిన సినిమాలు ఉండడంతో మహేశ్ చేయలేకపోయారట. అంతే కాకుండా మహేశ్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్ గా కూడా తీసుకోవాలని భావించారట.. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మహేశ్ నో అన్న తర్వాత ఆ కథ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెంతకు చేరిందట.. కానీ అక్కడ కూడా అడియాసే ఎదురైంది శేఖర్ కమ్ములకు… చరణ్ కూడా తన ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి నో చెప్పారట. అలా సినిమా కథ చివరికి వరుణ్ తేజ్ కి చెప్పాడట. వరుణ్ తేజ్ విని ఒకే చెప్పాడట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సినిమా తీస్తున్నాడు.