ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చెయ్యడమే అనేది టాలీవుడ్ లో కొత్తేమి కాదు, ఎప్పటి నుండో జరుగుతున్నా విషయమే. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఏ ఇండస్ట్రీ లో అయినా ఇది సర్వసాధారణం. అలా మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన ఒక కథతో , అక్కినేని నాగార్జున ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ హిట్ కొట్టాడు. అప్పట్లో ఈ ఎక్కడ చూసిన ఈ సినిమా మేనియా నే కనిపించేది.
ఈ సినిమాలోని పాటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయ్యేవి. ఆ సినిమా మరేమిటో కాదు, ‘మాస్’. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన సెన్సేషన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆరోజుల్లోనే ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రం తర్వాత నాగార్జున కి మళ్ళీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడానికి చాలా రోజులే పట్టింది.
అయితే ఈ సినిమాని తొలుత మెగాస్టార్ చిరంజీవి తో చెయ్యాలని అనుకున్నాడట ఆ చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్. లారెన్స్ చిరంజీవి కి ఎంత పెద్ద వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి వరకు కేవలం డ్యాన్స్ మాస్టర్ గానే కెరీర్ ని కొనసాగిస్తున్న లారెన్స్, డైరెక్టర్ గా మారబోతున్నాను, నా దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది, ఒక్కసారి అవకాశం ఇస్తే వచ్చి వినిపిస్తాను అన్నయ్యా అని అడిగాడట.
చిరంజీవి సరే వచ్చి చెప్పు అనగా, ఒకరోజు ఆయనని కలిసి మాస్ సినిమా స్టోరీ మొత్తాన్ని వివరించాడు. కథ బాగా నచ్చింది కానీ, ఈ చిత్రానికి నాకంటే నాగార్జున కి చాలా బాగుంటది అని చెప్పి, నాగార్జున కి స్వయంగా ఈ కథ వినమని ఫోన్ చేసి చెప్పాడట. అలా లారెన్స్ కలిసి నాగార్జున కి స్టోరీ వినిపించడం, ఆయన వెంటనే ఓకే చేసి ఈ సినిమా పూర్తి చెయ్యడం , అది భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.