80ల్లో శృంగార తారగా దేశాన్ని ఓ ఊపు ఊపేశారు సిల్క్ స్మిత. ఆమె అసలు పేరు విజయలక్ష్మి.. తన అత్తింటి వారి వేధింపులు తాళలేక చెన్నై పారిపోయింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలోని కొవ్వలి సిల్క్ స్మిత స్వగ్రామం. తన అత్తింటివారి వేధింపులు తాళలేక చెన్నై పారిపోయింది. ఆ సమయంలో ఆమె చేతిలో చిల్లి గవ్వలేదు. పరిచయం ఉన్నవాళ్లు లేదు. . చదువు రాదు.. కేవలం తనకు బతకాలన్న మొండితనం మాత్రమే ఆమెను సిని రంగం వైపు అడుగులు వేసేలా చేసింది. ఒక్కో విషయం నేర్చుకుంటూ స్టార్ అయిపోయింది. తాను వందల కొద్ది చిత్రాల్లో నటించింది. ఆ రోజుల్లో సిల్క్ స్మిత లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. రాకెట్ వేగంతో కెరీర్లో దూసుకుపోయిన ఆమె అంతే వేగంతో కనుమరుగైంది. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత కన్నుమూసింది. చెన్నైలో తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఇప్పటి వరకు ఆమె మరణం మిస్టరీ వీడలేదు.
ఈ క్రమంలోనే ఆమె తనకు తెలిసిన వారి ద్వారా చెన్నై వచ్చి అక్కడ కొందరు ఇళ్లల్లో పనులు చేసేది. అలా అప్పటి స్టార్ హీరోయిన్ అపర్ణ ఇంట్లో పనిమనిషిగా చేరింది. ఆమెకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే అమితమైన ఇష్టం. జీనత్ అమన్ లాంటి స్టార్ డ్యాన్సర్ కావాలనేది ఆమె కల. దాని నెరవేర్చుకునే దిశలో దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఒక మగాడు ఒక ఆడది సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమాలో జయప్రద సోదరుడు రాజబాబుకు జోడిగా నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ పలు వేశ్య పాత్రలో నటించింది. తాను స్పెషల్ సాంగ్స్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో దేశం మొత్తం ఆమె డ్యాన్సుకు షేక్ అయింది. తెలుగు, తమిళం, కన్నడం ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలేసింది.