Tamannaah : ‘నేను చేసిన వాటిలో ఆ సినిమా అంటే నాకు అస్సలు’.. తేల్చి చెప్పిన తమన్నా

- Advertisement -

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా శ్రీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది. అందులో కలర్ తప్పా హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలు లేవని చాలామంది అనుకున్నారు. కానీ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో అమ్మడు కుర్రకారు హార్ట్ బ్రేక్ చేసింది. దీంతో తన కెరీర్ రాకెట్ కంటే వేగంగా పరిగెత్తింది. పట్టిందల్లా బంగారం అయిపోయి స్టార్ స్టేటస్ అందుకుని టాప్ హీరోయిన్ గా కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన తమన్నాకు తను చేసిన వాటిలో ఓ సినిమా అంటే అస్సలు నచ్చదట. ఆ సినిమాను పేరుతో సహా బయట పెట్టేసింది . ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా తమన్నా రజనీకాంత్ సరసన తొలిసారిగా నటిస్తున్న సినిమా జైలర్. ఈ మూవీ ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఓ కోలీవుడ్ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్ము బేబీ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతే కాకుండా తన కెరీర్ కు సంబంధించిన పలు కీలక విషయాలు చెప్పింది.

Tamannaah
Tamannaah

ఈ సమయంలోనే ఆమెకు తమిళంలో చేసిన ఓ సినిమా నచ్చలేదని చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో తన నటన చూసి తనకే విరక్తి కలిగిందట.. అది చిన్న హీరో సినిమా కాదు. దళపతి విజయ్ మూవీ. తమన్నా, విజయ్ కలిసి నటించిన సుర అనే సినిమా తనకు నచ్చదట. ఇందులోని పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చినా సినిమా మాత్రం ప్లాప్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మూవీ అది. ఆ సినిమాలో తన నటన తనకే నచ్చలేదట . ఇప్పటికీ ఆ సినిమాలో తాను నటించిన విధానం చూసి ఫీలవుతుందట.. కొన్ని సీన్స్ అయితే అసలు నేనేనా నటించింది అని చూసి ఆశ్చర్యపోతుందట. షూటింగ్ టైంలో వీటి గురించి ఆలోచించే టైం లేక వాటి గురించి పెద్దగా ఆలోచించలేదట. ఒక సినిమాను ఒప్పుకున్న తర్వాత ఎలా ఉన్నా సినిమా పూర్తి చేయాల్సిందే. తప్పదంటూ తమ్ము బేబీ చెప్పుకొచ్చింది. ఈ విధంగా తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here