స్టైలిష్ స్టార్ నుంచి ఐకానిక్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే అదే రేంజ్ ఫాలోయింగ్ అతని సతీమణి అల్లు స్నేహారెడ్డి కి కూడా ఉంది. ఆమె సోషల్ మీడియా అకౌంట్లో పెట్టే ప్రతి పోస్ట్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. దానితో పాటుగా అప్పుడప్పుడు ఆమె పెట్టే స్టైలిష్ ఫోటో షూట్స్ ఓ రేంజ్ లో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తాయి.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటు. అలాగే తన స్టైలిష్ లుక్స్ మరియు మార్వలస్ ఫ్యాషన్ టేస్ట్ తో అందరి మనసులు దోచుకునే వ్యక్తి అల్లు స్నేహ. ట్రెండ్ ఫాలో అవ్వడమే కాకుండా తనకు తానే ఒక ట్రెండ్ సెట్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది స్నేహ. అయితే ప్రస్తుతం ఆమె పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
సోషల్ మీడియా వేదికగా అల్లు స్నేహ తన భర్తను రొమాంటిక్గా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోతో పాటు ఓ చిన్న క్యాప్షన్ ని కూడా షేర్ చేయడం జరిగింది. ఇందులో ఆమె తనకు వంట చేయడం కంటే ముద్దు పెట్టడమే బాగా వచ్చు అని రాసిన కొటేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల చర్చలకు దారితీస్తోంది. అల్లు స్నేహ ఇంత రొమాంటిక్ అని కొంతమంది అభిప్రాయపడుతుంటే, మరి ఇలా పబ్లిక్ గా చెప్పడం అవసరమా అని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
ఏదేమైనా అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ పోస్టును విపరీతంగా షేర్ చేసి బాగా వైరల్ చేస్తున్నారు. అల్లు స్నేహ సినిమాలకు ఎంతో దూరంగా ఉన్నప్పటికీ.. ఆమె అంటే అల్లు అర్జున్ అభిమానులకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇటు పిల్లలను అటు కుటుంబ బాధ్యతలను నిర్వహించడమే కాకుండా ఎంతో సమర్థవంతంగా బిజినెస్ కూడా రన్ చేసే పవర్ఫుల్ లేడీ స్నేహ రెడ్డి.