Bro the Avatar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి రోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, రెండవ రోజు నుండి ఫ్యామిలీ ఈ సినిమా ఆదరించడం మొదలు పెట్టడం తో వసూళ్లు వేరే లెవెల్ లో వచ్చాయి. కానీ అది పవర్ స్టార్ రేంజ్ వసూళ్లు కానే కావు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఆయన గత చిత్రం ‘భీమ్లా నాయక్’ ఇంతకంటే తక్కువ టికెట్ రేట్స్ తో 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కేవలం మూడు రోజుల్లో రాబట్టింది. కానీ ‘బ్రో ది అవతార్’ చిత్రం మూడు రోజులకు కలిపి కేవలం 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది . అయితే భీమ్లా నాయక్ టాక్ మరియు జానర్ తో పోలిస్తే బ్రో కి మంచి వసూళ్లే వచ్చాయి అని చెప్పొచ్చు.
ప్రాంతాలవారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూస్తే , నైజం ప్రాంతం లో ఈ చిత్రం ఇప్పటి వరకు 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తూ ఉంటే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆంధ్ర లో ఈ చిత్రానికి నిన్న 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఉత్తరాంధ్ర లో 5 కోట్ల 50 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు కోట్ల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కోట్ల 70 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 4 కోట్ల రూపాయిలు, కృష్ణ జిల్లాలో రెండు కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్/ తెలంగాణ కలిపి 46 కోట్ల రూపాయిలు , ప్రపంచవ్యాప్తంగా కలిపి 55 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమా ఇంకా 44 కోట్ల రూపాయిలను రాబట్టాలి.