పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడిగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం బ్రో. నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ జూలై 28న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ బ్రో ఫస్ట్ డే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో పవన్ ఉన్నా మరీ ఆహా ఓహో అనే రేంజ్లో లేదని అంటున్నారు. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ ఇది.
కేతిక శర్మ ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. రోహిణి, ప్రియా ప్రకాష్ వారియర్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి వంటి నటులు కీలక పాత్రలను పోషించారు. పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల మేక కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఇది ఇలా ఉండగా బ్రో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే.. బ్రో సినిమాకు ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాదని తెలుస్తోంది. తమిళంలో వినోదయ సీతమ్ హిట్ తర్వాత దర్శకుడు సముద్రఖని.. తెలుగులో ముందుగా ప్రభాస్, అక్కినేని అఖిల్ తో చేయాలని అనుకున్నాడట.
కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయనను సముద్రఖని కలవలేకపోయాడట. ఆ ప్రయత్నం మానుకుని తర్వాత సూర్య, కార్తీలను సంప్రదించాడట. కానీ వారు కూడా ఆసక్తి కనబరచలేదట. దీంతో ఫైనల్ గా సముద్రఖనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ పేర్లను ఆయనకు సూచించాడట అలా బ్రో సినిమా వారి కాంబినేషన్లో తెరకెక్కిందని అంటున్నారు.