chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఏంటి సిల్క్ స్మితను కొట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. మరి నిజంగానే సిల్క్ స్మితను చిరు కొట్టారా. కొడితే ఎందుకు కొట్టారు. అందుకు కారణం ఏంటి? నిజంగానే కొట్టారా ? లేకపోతే ఏదైనా షూట్ లో భాగంగా అలా చేసారా? అందుకు కారణం ఏంటో ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసారు. మరి చిరు సహాయం పొందిన వారిలో జయకుమార్ కనగల ఒకరు.
ఈయన తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని చిరంజీవి, సిల్క్ స్మిత మధ్య జరిగిన విషయాన్నీ బయట పెట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.ఈయన మాట్లాడుతూ. చిరంజీవి, సిల్క్ స్మిత కాంబోలో ఎన్నో ఐటెం సాంగ్స్ వచ్చాయి అనే విషయం తెలిసిందే. అయితే ఒక సినిమాలో చిరంజీవి షూట్ లో భాగంగా సిల్క్ స్మితను కొట్టే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ గురించి సిల్క్ స్మిత కు చెప్పేటప్పుడు చిరు చెంపపై కొడతారు అని నేను చెబితే నన్ను కొడతాడా అంటూ సెటైరికల్ గా మాట్లాడింది.
ఆ సీన్ ప్రకారం.. చిరంజీవి సిల్క్ స్మితను కొట్టాలని జయకుమార్ అన్నారు. ఆ సమయంలో చిరంజీవి కొడతాడా నన్ను అని సిల్క్ స్మిత అన్నదని కొట్టకుండా సీన్ తీయలేరా అంటూ నన్ను ట్రీజ్ చేసిందని జయకుమార్ పేర్కొన్నారు. నన్ను సిల్క్ స్మిత టీజ్ చేసిందని చిరంజీవికి తెలిసి టేక్ లో చిరంజీవి వాస్తవంగానే లాగి సిల్క్ స్మితను కొట్టారని ఆమె అమ్మో అని చతికిలపడిందని కనగాల జయకుమార్ పేర్కొన్నారు. ముందు రోజు దెబ్బ తిన్న సిల్క్ స్మిత రాత్రి 9 గంటల వరకు షూట్ ఉంటే ఆరు గంటలకే వెళ్లిపోతానని చెప్పిందని తెలిపారు జయకుమార్. ఆరు గంటలకు పంపించకపోవడం వల్ల ఆమె ఆ*హాల్ కూడా సేవించేది అని తెలిపారు.