Gossips : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతల బాగోగులు ఆలోచించే హీరోలు చాలా మంది ఉన్నారు, అలాగే పూర్తి కమర్షియల్ గా ఆలోచించే హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. ఎంత కమర్షియల్ అంటే దాబూలు సరైన సమయానికి ఇవ్వకపోతే డబ్బింగ్ కూడా చెప్పని వాళ్ళు ఉన్నారు. కొంతమంది హీరోలు పాపం సినిమా విడుదలై రెండేళ్లు గడిచినా పూర్తి స్థాయి రెమ్యూనరేషన్ ని తీసుకోని వాళ్ళు కూడా ఉన్నారు.
అయితే ఒక హీరో మాత్రం పూర్తిగా కమర్షియల్ గా ఆలోచించేవాడట. నిర్మాత ఏమైపోతాడో, ఇతర ఆర్టిస్టుల కాల్ షీట్స్ ఏమైపోతాయి, ఇలాంటివి ఏమి ఆలోచించకుండా, ఇష్టమొచ్చిన టైం లో షూటింగ్ కి వచ్చి, తనకి ఇష్టమొచ్చిన టైం లో వెళ్ళిపోతాడట. మళ్ళీ టేక్స్ కి మధ్య ఇతగాడు తీసుకునే గ్యాప్స్ మామూలుగా ఉండదని టాక్. దాంతో పది రోజుల్లో పూర్తి కావాల్సిన సినిమా నెలరోజుల సమయం తీసుకునేదట. నిర్మాతకి నరకప్రాయం లాగ ఉండేది.
మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ హీరో ఏది డిమాండ్ చేస్తే అది నిమిషాల్లో తెచ్చిపెట్టాలట, అతనికి అందువల్ల ఏమాత్రం మూడ్ డిస్టర్బ్ అయినా వెంటనే షూటింగ్ స్పాట్ నుండి వెళ్లిపోయేవాడట. అలా ఒకరోజు మినరల్ వాటర్ లొకేషన్ లో లేదని షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఫోన్ కాల్స్ కి కూడా చిక్కలేదట. విదేశాలకు వెళ్లి నెల రోజుల తర్వాత ఇండియా కి వచ్చాడట.
అప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి 50 శాతం అయ్యింది. అలా సగానికి పైగా షూటింగ్ జరిగిన సినిమాకి డేట్స్ కోసం నిర్మాత ప్రాధేయపడితే ఇస్తాను అని చెప్పి తిప్పించుకునేవాడట. ఇక ఫైనాన్స్ నుండి ఒత్తిడి తట్టుకోలేక ఆ సినిమా షూటింగ్ శాశ్వతంగా ఆపేసాడట. ఇందువల్ల నిర్మాతకు వంద కోట్ల రూపాయిలు నష్టాలు వాటిల్లిందని సమాచారం. ఇంత రాక్షసం గా ప్రవర్తించిన ఆ హీరో కి ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలే లేవు.