Samantha : సినిమాలు మానేసి ఈ పని చేస్తున్న సమంత.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

- Advertisement -

Samantha : స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. హీరో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా షూటింగ్‍ను పూర్తి చేసుకున్నారు సామ్. అలాగే, సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ఇటీవలే ఫినిష్ చేశారు. ఆ తర్వాత మరే మూవీకి ఓకే చెప్పలేదు. బ్రేక్ తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. మయోసైటిస్‍తో బాధపడుతున్న సమంత.. చికిత్స తీసుకునేందుకు త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. ఈ తరుణంలో సమంత న్యూలుక్‍లోకి మారారు. షార్ట్ హెయిర్ కట్‍తో చాలా కొత్తగా కనిపించారు. కొత్త లుక్‍కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు సామ్.

samantha
Samantha

సమంత హెయిర్ కట్ చేయించుకొని.. షార్ట్ హెయిర్‌తో కనిపించారు. బీచ్ వద్ద తీసుకున్న ఓ వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సమంత నవ్వు హైలైట్‍గా ఉంది. ఈ కొత్త లుక్‍లో అందమైన నవ్వుతో సామ్ మెరిసిపోయారు. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నా.. సంతోషంగానే ఉన్నాననేలా ఈ వీడియో పోస్ట్ చేసినట్టు అనిపిస్తోంది. ఈ వీడియో చూసిన సమంత అభిమానులు ఆనందిస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమాలు మానేసి ఇలా తిరుగుతున్నావావ అని అనుకుంటున్నారట. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాక.. ఇటీవల ధ్యానం చేసిన ఫొటోలను సమంత షేర్ చేసుకున్నారు.

సమంత

కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‍లో ధ్యానం చేసిన ఫొటోలను పోస్ట్ చేశారు. లోపల ఎంత బాధ ఉన్నా ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతోందని సమంతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. త్వరగా మళ్లీ నటించాలని కోరుకుంటున్నారు. కాగా, మయోసైటిస్‍తో కొంతకాలంగా బాధపడుతున్న సమంత చికిత్స కోసం బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ట్రీట్‍మెంట్ కోసం అమెరికా వెళ్లనున్నారని తెలుస్తోంది. మయోసైటిస్ ఉన్నా రెండేళ్లుగా అలాగే చిత్రాలను చేశారు సమంత. ఆమె ప్రధాన పాత్ర పోషించిన యశోద చిత్రం గతేడాది మంచి విజయాన్ని అందుకుంది. అయితే, ఈ ఏడాది వచ్చిన శాకుంతలం మాత్రం నిరాశపరిచింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here