Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అతడి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో చిత్రం ట్రైలర్ నిన్న (జూలై 22) విడుదలైంది. కామెడీ, ఎమోషన్స్, ట్విస్ట్, మంచి డైలాగ్స్, కాస్త రొమాన్స్‌తో బ్రో ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంది. పవన్ కల్యాణ్ ఎనర్జిటిక్, వింటేజ్ లుక్‍తో అదరగొట్టాడు. దీంతో బ్రో మూవీపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ ట్రైలర్ చూసి ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. బ్రో సినిమా ట్రైలర్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొన్ని ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ ఇక్కడ చూడండి. తమిళ మూవీ వినోదయ సిత్తంకు రీమేక్‍గా బ్రో సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‍గా చేసింది. కాలానికి దేవుడి పాత్రలో పవన్ కల్యాణ్ నటించగా.. కాలంతో పాటు పరుగెత్తే యువకుడి పాత్రను చేశాడు సాయిధరమ్ తేజ్.
దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. జూలై 28న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. కాగా, నేడు వచ్చిన బ్రో ట్రైలర్‌పై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే.. వింటేజ్ పవన్ కల్యాణ్‍ను మళ్లీ చూస్తున్నామని, చాలా సంతోషంగా ఉందంటూ చాలా మంది బ్రో ట్రైలర్ గురించి స్పందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఎనర్జిటిక్ పవర్ స్టార్ అవతారాన్ని చూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. థియేటర్లలో పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా బ్రో ట్రైలర్ చివర్లో పవన్ కల్యాణ్.. జల్సా మూవీ ఐకానిక్ సిగ్నేచర్ ఉండడంపై అభిమానులు ఆనందిస్తున్నారు. “ఈ ఎనర్జీ కోసం 12 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఇప్పుడు చూస్తున్నాం. థాంక్యూ సముద్రఖని” అని యూజర్ ట్వీట్ చేశారు. ఎన్నేళ్లయినా పవన్ స్వాగ్ ఏ మాత్రం తగ్గలేదంటూ జల్సా ఫొటోతో బ్రోను పోలుస్తున్నారు అభిమానులు. తమ అభిమాన హీరోను ఇంత ఎనర్జిటిక్‍గా చూపిన దర్శకుడు సముద్రఖనిని ప్రశంసిస్తూ చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్‍ను కూడా చాలా మంది పొగుడుతున్నారు. బ్రో ట్రైలర్లో బ్రహ్మానందం కనిపించడం పట్ల కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మీ మళ్లీ పురోహితుడి పాత్ర చేస్తుండడంపై ఆసక్తిగా ఉన్నామని అంటున్నారు. థమన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ గురించి కూడా ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.