Sai Dharam Tej : బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ కి అన్నీ బాగా కలిసి వస్తున్నాయి అనే చెప్పాలి. ఇప్పటికే విరూపాక్ష చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టిన సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో ది అవతార్’ అనే చిత్రం లో నటించాడు. ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని నేడు సాయంత్రం విడుదల చెయ్యబోతున్నారు మేకర్స్. ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు వారం రోజులు కూడా లేదు, కాని ట్రైలర్ వర్క్ ఇంకా రాలేదు అనే ఫ్రస్ట్రేషన్ అభిమానుల్లో నిన్న మొన్నటి వరకు ఉండేది. మరి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ట్రైలర్ ఉంటుందో లేదో చూడాలి.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో సాయి ధరమ్ తేజ్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమా గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ అభిమానుల్లో ఈ చిత్రం పై మరింత ఆసక్తి పెంచేలా చేస్తున్నాడు.

ఇదంతా పక్కన పెదితే సాయి ధరమ్ తేజ్ ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘మీరు ఈ చిత్రం లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నటించారు కదా , నిజ జీవితం లో కూడా మీరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని విన్నాము, నిజమేనా’ అని అడగగా, దానికి సాయి ధరమ్ తేజ్ సమాధానం చెప్తూ,’అవును.సినిమాల్లోకి రాకముందు ఒక MNC కంపెనీ లో జాయిన్ అయ్యాను. కానీ మూడు రోజులకే అక్కడి నుండి పారిపోయాను..ఇది మన పని కాదు అని అంత తొందరగా అర్థం అయ్యింది ‘ అంటూ చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్.