Samantha : విజయ్ దేవరకొండతో సమంత చేస్తున్న ఖుషీ
మూవీ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ నేఫథ్యంలోనే చిత్ర బృదం ప్రమోషన్స్‌ని ప్రారంభించారు.ఇందులో భాగంగానే ఆరాధ్య…
అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఈ పాటు నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే షూటింగ్ లు పూర్తి చేసుకుని, ఇతర నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్స్‌లని కూడా తిరిగి ఇచ్చేసిన సమంత ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోంది. త్వరలో ప్రత్యేక ట్రీట్మెంట్ కోసం యుఎస్ వెళ్లబోతోంది.

ఈ నేఫథ్యంలో సామ్ గురువారం ఇన్ స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన వీడియో, ఆ వీడియోకు ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తికరంగా మారింది. ఖుషీ
సినిమాలోని ఆరాధ్య.. అంటూ సాగే లిరికల్ వీడియోలోని ఓ క్లిప్‌ని షేర్ చేసిన సమంత
ఇలాంటి వాడ్నే ప్రేమించండి..పెళ్లి చేసుకోండిఅంటూ పోస్ట్ పెట్టడం నెట్టింట చర్చకు దారి తీసింది.
ఆరాధ్యపాటలో సమంతను బెడ్‌పై విజయ్ దేవరకొండ హత్తుకునే రొమాంటిక్ సీన్‌లున్నాయి. ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదరడం, ఈ పాటలోని రొమాంటిక్ క్లిప్‌ని షేర్ చేస్తూ
ఇలాంటి వాడ్నే ప్రేమించండి..పెళ్లి చేసుకోండిఅంటూ సమంత కామెంట్ చేయడంతో నెట్టింట రచ్చ మొదలైంది. ఈ వీడియో నాగచైతన్య చూస్తే పరిస్థితేంటీ అని కొంత మంది కామెంట్ చేస్తుంటే మరి కొంత మంది మాత్రం సమంతని ట్రోల్ చేస్తున్నారు. దీంతో
ఆరాధ్య` వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక సమంత ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తను నటిస్తున్న సినిమాల షూటింగ్‌లని శర వేగంగా పూర్తి చేసింది. ఇటీవలే సమంత నటిస్తున్న ఖుషీ
మూవీ షూటింగ్ పూర్తయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు సమంత ది ఫ్యామిలీ మ్యాన్
డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకె దర్శకద్వయం రూపొందిస్తున్న ఇండియన్ వెర్షన్ సిటాడెల్
లోనూ నటిస్తోంది. ఇటీవలే ఈ సిరీస్ షూటింగ్ ని సామ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ రెండింటికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.