Vijay Deverakonda : తెలుగు స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా ఖుషి..ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.. రొమాంటిక్ లవ్ స్టోరీ గా రూపోందుతున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ఇందుకు సంబందించిన ఫోటోలను కూడా విజయ్ షేర్ చేశారు.. ఇప్పుడు మరో వీడియోను షేర్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

రొమాంటిక్ జోనర్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో వీరిద్దరూ రెచ్చిపోయి నటించారు.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్ జనాల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.. దాంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. ఇక తాజాగా విడుదలైన రొమాంటిక్ సాంగ్ వీడియో మాత్రం కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటుంది.. దాంతో క్షణాల్లో ట్రెండింగ్ లోకి వచ్చింది.. ఆ వీడియోలో సామ్‌తో కలిసి బెడ్‌పై నిద్రిస్తున్నపుడు ఒకరినొకరు కౌగిలించుకోవడం, కాళ్లు చేతులు వేసుకోవడానికి సంబంధించిన సీన్ ఆ వీడియోలో కనిపిస్తుంది..

ఇక ఇందులో నైట్ డ్రెస్‌లో ఇద్దరూ బ్యూటీఫుల్‌గా కనిపించగా కొంతమంది అభిమానులు అమేజింగ్ అంటూ పొగిడేస్తుంటే మరికొందరు బోల్డ్ కామెంట్స్‌తో ట్రెండ్ చేస్తున్నారు. ఆ పాటలోని మోస్ట్ రొమాంటిక్ క్లిప్‌ను అభిమానులతో పంచుకున్నారు. అంతే కాకుండా ‘మన ప్రేమ అంటే ఇలానే ఉంటుంది’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఖుషీ చిత్రంలోని రెండో పాట ‘ఆరాధ్య.. నా ఆరాధ్య.. నువ్వే లేనిదీ ఏది వద్దు ఆరాధ్య’ అంటూ సాగే పాటను తెలుగు వెర్షన్లో రాశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.. ప్రస్తుతం ఈ సాంగ్ లైకులు కామెంట్స్ తో తెగ వైరల్ అవుతుంది..