Sitara : మహేష్ బాబు, నమ్రత దంపతుల కూతురు సితార పాప మల్టీటాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో డాన్స్ వీడియోస్, ఫ్యామిలీ విశేషాలను పంచుకుంటుంది. ఇక ఇటీవలే ఓ ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది. సదరు జ్యూవెల్లరీ సంస్థ కోసం ఇచ్చిన యాడ్ ఫోటోస్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ యాడ్ లో తనని ప్రిన్సెస్ లా చూసుకుంటారు అని సితార చెప్పగా, దానికి సితార.. “నేను ప్రిన్సెస్ కాదు మహారాణి కావాలని అనుకుంటున్నాను” అంటూ వ్యాఖ్యానించింది. అమెరికా నుంచి వచ్చి మనవరాలుకు ఓణీల ఫంక్షన్ చేసే నేపథ్యంలో ఈ యాడ్ సాగింది. ఫంక్షన్ వద్దు అనుకున్న అమ్మాయిని జ్యూవెలరీ షోరూమ్ కు తీసుకెళ్లగానే అక్కడ నగలు చూసి ఫంక్షన్ చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అయితే అంతా బాగున్నాకానీ, యాడ్ మాత్రం మూడు నిమిషాలకు పైగా ఉండడంతో కొందరు మాత్రం యాడా లేకుంటే షార్ట్ ఫిల్మ్ మా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై సితార ఫోటోస్ ప్రదర్శించడంతో మహేష్ బాబు సంతోషానికి అవధులు లేవు. తన కూతురు ఫస్ట్ యాడ్ ఫోటోస్ షేర్ చేస్తూ గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు మహేష్. ఇక తాజాగా ఆ యాడ్ వీడియోను రిలీజ్ చేశారు మహేష్. తన కూతురు బ్యూటీఫుల్ టాలెంట్ చూసి గర్వంగా ఉందంటూ పోస్ట్ చేశారు. ఇక తాజాగా విడుదలైన వీడియోలో సితార నటనతో అదరగొట్టిందనే చెప్పాలి. ఇప్పటికే నటనలో చాలా అనుభవం ఉన్న అమ్మాయిలా నటించింది.. మొత్తానికి నటనలో తండ్రిని మించిపోయేలా కనిపిస్తోంది సితార.