Rashmi Gautam : చిరంజీవిలో అది చూసిన షాక్ అయ్యాను.. భోళా శంకర్ లో డ్యాన్స్ పై రష్మి కామెంట్స్

- Advertisement -

Rashmi Gautam జబర్దస్త్‌ బ్యూటీ రష్మి.. చిరంజీవి పక్కన అవకాశాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ‘భోళా శంకర్‌’లో ఆమె నటిస్తోందని ఇప్పటికే స్పష్టమైంది. అయితే ఎలాంటి పాత్రలో కనిపిస్తుంది, ఎలా ఉంటుంది అనే కుతూహలం అయితే ఫ్యాన్స్‌కి ఉంది. దీనికి సమాధానం ఇటీవల చిరు లీక్స్‌లో తెలిసిపోయింది. చిరు లీక్స్‌ పేరుతో చిరంజీవి ఇటీవల ఓ వీడియో రిలీజ్‌ చేశారు. అందులో పవన్‌ కల్యాణ్‌ మేనరిజాన్ని సినిమాలో అనుకరించినట్లు చెప్పారు. అయితే ఆ లీక్‌తోపాటు మరో లీక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదే రష్మి. ఆ వీడియోలో తళుక్కున మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచిందామె. ప్రస్తుతం ఆ వీడియో స్క్రీన్‌ షాట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Rashmi Gautam
Rashmi Gautam

అంతకంటే పెద్ద సర్ ప్రైజ్ విషయం ఏంటి అంటే ఆ వీడియో లో చిరంజీవి పక్కన మినీ స్కర్ట్ లో నడుము అందాన్ని చూపిస్తూ.. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ జబర్దస్త్ హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ సర్ ప్రైజ్ చేసింది.హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్నా కూడా పెద్దగా ఆసక్తి చూపించకుండా ఇలాంటి స్పెషల్ రోల్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉన్న ముద్దుగుమ్మ రష్మి గౌతమ్ భోళా శంకర్ లో కనిపించేది కొద్ది నిమిషాలే అయినా కూడా కచ్చితంగా మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల ను సర్ ప్రైజ్ చేయడం ఖాయం అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ అమ్మడి యొక్క వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భోళా శంకర్ లో ఈ జబర్దస్త్ హాట్ బ్యూటీ కూడా ఉందా అంటూ చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు స్కిన్ షో చేస్తే భలే ఉందే అన్నట్లుగా అనిపించడం ఈ అమ్మడి సొంతం. అందుకే చిరంజీవి ఒక వైపు పవన్ మేనరిజం చేస్తున్నా కూడా చాలా మంది రష్మి గౌతమ్ ను చూస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మి.. తనకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో తెలిపింది. తెలుగులో తాను నేర్చుకున్న మొదటి పాట కూడా ఆయనదేనని చెప్పింది. ‘‘చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ చేయాలంటే భయం వేసింది. కానీ ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. సీన్‌ చేస్తున్నప్పుడు ప్రతి షాట్‌కు ముందు నాతో మాట్లాడేవారు. ‘భోళా శంకర్‌’లో ఆయనతో కలిసి ఓ పాట మొత్తం డ్యాన్స్‌ చేశాను. అంత పెద్ద స్టార్‌ అయినా.. అందరితో కలిసిపోయే వాళ్లు. ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి అద్భుతమైన వ్యక్తి’’ అని గతంలో ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్నప్పుడు రష్మి తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here