Samantha టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ ఖుషీ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఆరాధ్య అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్‌లో సామ్ వేసుకున్న చెప్పుల ధర అందరికీ షాక్ ఇస్తుంది. ‘ఖుషి’. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన పోస్టర్‌లో సమంత సింపుల్ లుక్‌లో సూపర్‌గా కనిపించింది. సామ్ లుక్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ పోస్టర్‌లో ఇప్పుడు అంతా సమంత చెప్పుల కోసం చర్చించుకుంటున్నారు. సొగసైన అప్రాజిత తూర్ ఖైత్ హీల్స్‌తో ఈ సాంగ్‌లో సమంత మరింత ఆకర్షణీయంగా కనిపించింది. సమంత తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని మరోసారి ఈ చెప్పుల ద్వారా చూపించింది. అయితే సింపుల్ లుక్‌లో కనిపిస్తున్న వీటి ధర రూ. 7,399. ఈ చెప్పులు సమంత లుక్‌ను మరింత పెంచాయంటున్నారు అభిమానులు.

ఇందులో విజయ్, సమంత కెమిస్ట్రీ బాగా పండింది. పిక్చరైజేషన్, లిరిక్స్, ట్యూన్స్ చాలా బాగున్నాయి. ఖుషీ’ సినిమా సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ బయటకి వచ్చిన టైటిల్ పోస్టర్లు, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. నవీన్ ఎర్నేని – వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు. మరోవైపు శాకుంతలం రిలీజ్ తర్వాత… సమంత చేతిలో ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాతో పాటు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. ఈ రెండింటి షూటింగ్స్ పూర్తయ్యాయి.