Rangasthalam : ఈమధ్య కాలం లో మన తెలుగు సినిమాలకు పాన్ వరల్డ్ రేంజ్ గుర్తింపు రావడాన్ని చూస్తుంటే మనకి ఎంతో గర్వంగా ఉంటుంది. ఇలా మన సినిమాకి ఈ స్థాయి వచ్చింది మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి కారణంగా. ఆయన సినిమాలు జపాన్ , చైనా అని తేడా లేకుండా ప్రతీ చోట దుమ్ము లేపి దంచి కొడుతూ తెలుగు సినిమాకి సరికొత్త మార్కెట్ ని తెరిచాడు. అప్పటి నుండి మన స్టార్ హీరోలందరూ తమ సినిమాలను విడుదల చేసుకుంటూ సక్సెస్ లు అందుకుంటున్నారు.
ఇక గత ఏడాది రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా జపాన్ లో విడుదలై సంవత్సరం రోజులు ఆడింది. ఈ స్థాయిలో ఇప్పటి వరకు జపాన్ సినిమాలు కూడా ఆడలేదు అనడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు. ఆ స్థాయి విజయం సాధించింది కాబట్టే,ఆ చిత్రం లో హీరో గా నటించిన రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రాన్ని జపాన్ దేశ వ్యాప్తంగా విడుదల చేసారు.
జులై 14 వ తేదీన విడుదలైన ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ నుండే అద్భుతమైన ప్రారంభం దక్కింది. అలా ప్రారంభమైన ఈ సినిమా మొదటి రోజు జపాన్ లో 2.5 మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండవ రోజు కూడా ఇదే స్థాయి వసూళ్లు, అలా మూడు రోజులు ఒక రేంజ్ లో దంచి కొట్టింది. జపాన్ ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడు రోజులకు గాను 8 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయట. ఇక నాల్గవ రోజు కూడా అక్కడ సెలవు కావడం తో మరో రెండు మిలియన్ డాలర్లు వచ్చే ఛాన్స్ ఉంది.
అలా మొత్తం మీద నాలుగు రోజులకు ఈ సినిమాకి 10 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయట. రాబొయ్యే రూజుళ్ళూ కూడా ఈ సినిమాకి ఇదే స్థాయి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని, వంద మిలియన్ డాలర్లు దాటితే మాత్రం రామ్ చరణ్ కి జాక్పాట్ తగిలినట్టే అని చెప్పాలి. ‘రంగస్థలం’ చిత్రం రామ్ చరణ్ కి ఎంతో ప్రత్యేకమైన సినిమా, ఈ చిత్రం విడుదలైన కొత్తల్లోనే ఇతర భాషల్లోకి దబ్ చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ కి డబుల్ రేంజ్ రెస్పాన్స్ వచ్చి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.