Allu Sirish : వరుణ్ తేజ్ బాటలోనే అల్లు శిరీష్.. ఆ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్న హీరో..

- Advertisement -

Allu Sirish : ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని చక్కగా కాపురాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు.కానీ అందులో కొంతమంది పెళ్లికి ముందు ఎంతో బాగా ప్రేమించుకుని పెళ్లయినాక కొన్ని రోజులు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకున్న వారు ఉన్నారు.అయితే ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందులో అప్పటి సావిత్రి జెమినీ గణేష్ నుండి ఇప్పటి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి వరకు ఉన్నారు.

Allu Sirish
Allu Sirish

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీలోని నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వరుణ్ తేజ్ బాటలోనే మరో హీరో కూడా తాను ప్రేమించిన హీరోయిన్ నే పెళ్లాడబోతున్నారట. వీళ్ళిద్దరూ కూడా మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇండస్ట్రీలో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి విషయం ఇంట్లో తెలియడంతో అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ అనూ ఇమ్మానియేల్ ని ఇంటికి కోడలుగా ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది.

Allu Sirish Anu Emannuel

కానీ అల్లు శిరీష్ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను అని పట్టుబట్టడంతో చేసేదేమీ లేక అల్లు అరవింద్ కూడా వారి ప్రేమను యాక్సెప్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదే జరిగింతే మరికొన్ని రోజుల్లోనే వీళ్ళు కూడా ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా చేసుకొని పెళ్లి చేసుకోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ ఈ ప్రేమాయణం గురించి స్పందించిన విషయం తెలిసిందే. స్పందించిన శిరీష్ ఆ రూమర్స్ ను కొట్టి పడేశాడు. సినీ తారలపై ఇలాంటి రూమర్స్ క్రియేట్ అవడం సహజమేనని చెప్పిన శిరీష్, గతంలో ఇలాంటి రూమర్స్ తనపై చాలానే వచ్చాయన్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కి, తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, ప్రస్తుతం తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని అల్లు శిరీష్ తేల్చి చెప్పాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here