Sangeetha హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో అనేక చిత్రాలు చేసి.. ప్రస్తుతం సహాయక పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతున్న నటి సంగీత గురించి పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది చిరంజీవి ఆచార్య
, మసూదా చిత్రాల్లో నటించిన సంగీత.. ఈ ఏడాది వారసుడు
మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించింది. ఇందులో శ్రీకాంత్ భార్య పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్(ప్రేమ) ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఆసక్తికర, షాకింగ్ విషయాలను వెల్లడించింది.
తన పెళ్లి జీవితం గురించి ఓపెన్ అవుతూ, దాన్నుంచి బయటపడాలని అనుకున్నట్టు తెలిపింది. ప్రారంభంలో మ్యారేజ్ లైఫ్‌ని అసహ్యించుకున్నట్టు, దీన్నుంచి బయటకు రావాలని ప్రయత్నించినట్టు చెప్పింది. తొందరగా మ్యారేజ్ లైఫ్‌ని వదిలేయాలని అనుకుందట. అంత దారుణంగా సాగిందని చెబుతూ షాకిచ్చింది. సంగీత తమిళ నటుడు, సింగర్ క్రిష్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2009లో వీరి వివాహం జరిగింది. తిరువన్నమలై టెంపుల్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి పదేళ్ల పాప కూడా ఉంది. అయితే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట. అటు తన భర్త ఫ్యామిలీ నుంచి ఇట తమ ఫ్యామిలీ నుంచి చాలా ఒత్తిడి, గొడవలు అయినట్టు చెప్పింది.
దీంతో వారికి చాలా దూరమైపోయినట్టు చెప్పింది. ఆ సమయంలో అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్న భావన కలిగిందని తెలిపింది సంగీత. తెలిసో తెలియకో ఓ నిర్ణయం తీసుకున్నా. అది రైటా రాంగా? అనేది నాకు తెలియదు. కానీ దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది, సాధ్యమైతే దీన్ని సాల్వ్ చేసుకోవాలా?, లేదంటే దీన్నుంచి బయటపడాలా? అనే రెండు ఆప్షన్స్ మాత్రమే తన ముందు ఉన్నాయి, అయితే మా ఇద్దరి గురించి ఇద్దరికి అంతఎక్కువగా తెలియదు, ముందు మేం ఏంటనేది తెలుసుకోవాలని దానిపై వర్క్ చేశాం. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, బాగా నమ్మాం
అని వెల్లడిచింది సంగీత.