Baby : ‘బేబీ’ సినిమా హిట్ అవ్వాలంటే ఇన్ని కోట్లు వసూలు చెయ్యాలా..? ఇంత రిస్క్ అవసరమా!

- Advertisement -

Baby : రీసెంట్ సమయం లో యూత్ ని ప్రమోషనల్ కంటెంట్ తో విశేషం గా ఆకట్టుకున్న సినిమా ‘బేబీ’. కలర్ ఫోటో ఫేమ్ రాయి రాజెశ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కి ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించి కొన్ని థియేటర్స్ లో సెలెక్టివ్ ప్రీమియర్ షోస్ వేశారు.

Baby
Baby

అన్నీ కూడా హౌస్ ఫుల్ అయ్యాయి, టాక్ కూడా అదిరిపోయింది. కేవలం ఈ ప్రీమియర్ షోస్ నుండి వచ్చిన గ్రాస్ దాదాపుగా 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఒక స్టార్ హీరో సినిమాకి ప్రీమియర్ షోస్ వేస్తే ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో, అలాంటి కలెక్షన్స్ ఈ చిత్రానికి కూడా వచ్చాయి. ఈ స్థాయిలో ఈ చిత్రానికి క్రేజ్ రావడానికి కారణం అంతకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు , టీజర్ మరియు ట్రైలర్ మాత్రమే.

ఇకపోతే క్రేజ్ ఉండడం వల్ల ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల వరకు జరిగిందని సమాచారం. ఇది ఆనంద్ దేవరకొండ రేంజ్ కి చాలా ఎక్కువ అనే చెప్పాలి, భవిష్యత్తులో కూడా ఆయన ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని చూడడం చాలా కష్టం. టాక్ పాజిటివ్ గానే వచ్చింది కాబట్టి, ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కు ని దాటేస్తుందని అంటున్నారు.

- Advertisement -

ఇక తర్వాత కూడా 28 వ తారీఖు వరకు చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి, కచ్చితంగా ఫుల్ రన్ లో కూడా ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఇదే కనుక జరిగితే ఇక ఆనంద్ దేవరకొండ కూడా ఇండస్ట్రీ లో స్థిరపడిపోయినట్టే అని చెప్పాలి. మరి అది జరుగుతుందో లేదో చూద్దాం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here