Spy movie : విభిన్నమైన సినిమాలను చేస్తూ తనకంటూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు ని దక్కించుకున్న హీరోలలో ఒకడు నిఖిల్ సిద్దార్థ్. గత ఏడాది ఈయన ‘కార్తికేయ 2 ‘ చిత్రం ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన 18 పేజెస్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఇక రీసెంట్ గా సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ‘స్పై’ చిత్రానికి కూడా మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ ని దక్కించుకుంది. అందుకు కారణం ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. టీజర్ మరియు ట్రైలర్ అద్భుతంగా ఉండడం తో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ దక్కింది. మొదటి రోజే ఆరు కోట్ల రూపాయిల రేంజ్ షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 17 కోట్ల రూపాయలకు జరిగింది. టాక్ వచ్చి ఉంటే మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకునేది, కానీ నిఖిల్ బ్యాడ్ లక్ కారణంగా టాక్ రాలేదు, అయ్యినప్పటికీ కూడా ఈ సినిమాకి డీసెంట్ స్థాయి వసూళ్లే నమోదు అయ్యాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి పది రోజులకు గాను 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.
ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలి అంటే మరో ఆరు కోట్ల రూపాయిలు రావాల్సి ఉంది. ఈ వీకేడ్ తో ఈ చిత్రం మరో కోటి రూపాయిల షేర్ ని రాబట్టే సూచనలు ఉండగా, ఫుల్ రన్ లో మరో 50 లక్షల రూపాయిల షేర్, అలా మొత్తం మీద 12 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి నాలుగున్నర కోటి రూపాయిల నష్టం తో బిజినెస్ లో క్లోజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే కమర్షియల్ గా యావరేజి రేంజ్ అన్నమాట,నెగటివ్ టాక్ తో ఇంత దూరం వచ్చింది అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.