1984 వ సంవత్సరం నుండి 1993 వ సంవత్సరం వరకు మెగాస్టార్ Chirajeevi మహర్దశ నడించింది. ముట్టుకున్న ప్రతీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ లేదంటే ఇండస్ట్రీ హిట్. ఆ స్థాయిలో ఆయన జోరు నడించింది. 1987 వ సంవత్సరం ‘యముడికి మొగుడు’ చిత్రం నుండి 1992 వ సంవత్సరం లో విడుదలైన ‘ఘరానా మొగుడు’ చిత్రం వరకు చిరంజీవి కి వరుసగా 5 ఇండస్ట్రీ హిట్స్ పడ్డాయి.
ఆయన రేంజ్ కి దరిదాపుల్లో మరో హీరో కూడా లేడు. తిరుగులేని నెంబర్ 1 హీరో గా, మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ‘అల్లుడా మజాకా’ అనే సినిమా నుండి చిరంజీవి కి బ్యాడ్ టైం ప్రారంభం అయ్యింది, వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి, ఆ గ్యాప్ లో హిట్లర్ , మాస్టర్ ,అన్నయ్య వంటి సూపర్ హిట్ సినిమాలు తగిలాయి కానీ, ఇవేమి మెగాస్టార్ రేంజ్ కి తగ్గ బ్లాక్ బస్టర్ హిట్స్ కావు.
ఇక అన్నయ్య తర్వాత చిరంజీవి చేసిన మృగరాజు, దాడి , శ్రీ మంజునాథ చిత్రాలు పెద్ద ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇక చిరంజీవి పని అయిపోయిందని అప్పట్లో అందరూ అనుకున్నారు. అలాంటి సమయం లోనే చిరంజీవి కి ‘ఇంద్ర’ సినిమా చేసే ఛాన్స్ దక్కింది. డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వం లో అశ్వినీదత్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కింది. మొదట్లో చిరంజీవి ఫ్యాక్షన్ జానర్ సినిమాలు నాకు సూట్ కావని, ఈ సినిమా నేను చెయ్యడం కరెక్ట్ కాదని చెప్పాడట, కానీ బి గోపాల్ పట్టుబట్టి మరీ ఒప్పించడం తో చిరు ఈ ప్రాజెక్ట్ ని చేసాడు. సినిమా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఎడిటింగ్ రూమ్ లో కొన్ని సన్నివేశాలను చూశాడట నిర్మాత అశ్వినీ దత్.
చూడగానే ఆయన ఎంతో సంతోషానికి గురై ఎలా అయినా ఈ విషయాన్నీ చిరంజీవి తో చెప్పుకోవాలని ఆత్రుతతో ఆరోజు అర్థరాత్రి సమయం లో చిరంజీవి ఇంటికి వెళ్ళాడట. ఇంత రాత్రి సమయం లో ఇక్కడికి వచ్చారేంటి అని చిరంజీవి సతీమణి సురేఖ అడగగా, అర్జెంటు గా చిరంజీవి ని నిద్ర లేపు అని చెప్పి, చిరంజీవి లేచిన తర్వాత ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇప్పుడే ఎడిటింగ్ రూమ్ లో చూసాను అని తన ఆనందాన్ని పంచుకున్నాడట , ఈ విషయాన్నీ చిరంజీవి గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.