JR NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటుడిగా పేరు తెచ్చుకున్నారు నందమూరి తారక రామారావు. ఆయన తర్వాత నందమూరి ఇంటి వారసులు ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి వచ్చారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన మూడు తరాల వారసులు ఇండస్ట్రీని ఏలుతున్నారు. బాలకృష్ణతో పాటు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల పాన్ వరల్డ్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’సినిమాలో నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తో జాహ్నవి నటిస్తోంది. ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్ బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికర విషయం హల్ చల్ చేస్తోంది.
ఎన్టీఆర్ కొడుకు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ పేరు తెచ్చుకున్నారు. అయితే తన చిన్న కుమారుడికి నందమూరి తారకరామ్ అని పేరు పెట్టడానికి గల కారణాన్ని ఆయన గతంలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా హరికృష్ణ వెల్లడించారు. ఆ రోజు ఫంక్షన్ సందర్భంగా ఆ రోజు హరికృష్ణ మాట్లాడుతూ..‘‘మా నాన్నగారు మా ఏడుగురు అన్నదమ్ములకు కృష్ణ అనే పేరు కలసివచ్చేలా పెట్టారు.
అలాగే మా నలుగురు అక్కాచెల్లెళ్లకు ఈశ్వరీ అనే పేరు కలిపిపెట్టారు. ఆయనకు దైవ భక్తి మెండుగా ఉండేది..అందుకే మా పేర్లలో భగవంతుడి పేరు వచ్చేలా కలిపి పెట్టారు. అయితే నా పిల్లలకు పేర్లు పెట్టే బాధ్యత కూడా మా నాన్నగారికే వదిలేశాను’ అని అన్నారు. పిల్లలు పుట్టినప్పుడు పేర్లు పెట్టాల్సిందిగా నాన్నగారి దగ్గరకు వెళ్లాను. నాన్నగారిని ‘నా పిల్లలకు మీరే పేరు పెట్టాలి’ అని కోరాను. దీంతో ఇద్దరు పిల్లలకు జానకీ రామ్, కళ్యాణ్ రామ్ అని పేరు పెట్టారు. కానీ జూ.ఎన్టీఆర్ కు తారకరామ్ అని నేను పేరు పెట్టాను’’ అని చెప్పారు.
ఓ రోజు నాన్నగారు పిలిచి అవునూ నీ చిన్న కొడుకు ఎక్కడరా చాలా రోజులు అయ్యింది.. వాడిని చూడాలనిపిస్తుందని ఓసారి తీసుకురా అని ఆదేశించారు. వెంటనే తారక్ ని నాన్నగారి దగ్గరకు తీసుపోయాను… అప్పుడు నీ పేరు ఏంటిరా అని అడిగాడు.. వెంటనే తారక్ తాత గారూ.. నాన్న ఆ పేరు పెట్టారు అన్నాడు. వెంటనే లేదు నువ్వు అచ్చం నా రూపం.. నా పేరు నీకు ఉండాలి. ఈ రోజు నుంచి నీ పేరు తారక్ కాదు.. నందమూరి తారక రామారావు గా మార్చారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ అనే పేరుతో పిలవడం మొదలు పెట్టారు.