సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ RGV గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయన ఏం మాట్లాడిన వివాదమే అవుతుంది. ఎవరేమన్నా తన దారి తనదే.. ఒక్క మాటలో చెప్పాలంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్జీవీ. ఆయనలా బతకాలని చాలా మంది అనుకుంటుంటారు. ఇంకొంతమంది అసలు వర్మ లాంటి బతికు ఎందుకు అంటారు. కానీ వర్మ మాత్రం నా జీవితం నా ఇష్టం అంటూ తనకు ఎలా నచ్చితే అలా బతికేస్తూ ఉంటారు. ఎవరో ఏదో అంటారని, ఒకరి కోసం బతకడం లాంటివి వర్మ ఎప్పుడూ చేయడు.. చేయమని కూడా ఒకరికి చెప్పడు. అందుకే చాలామందికి వర్మ అంటే అభిమానం.

ఇక తాజాగా ఆర్జీవీ ఇండియాను వదిలేసి అమెరికాలో రచ్చ చేయడానికి వెళ్లాడు. 20 ఏళ్ల తర్వాత నాటా వేడుకల కోసం వర్మ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత పాత చింతకాయ పచ్చడిలా తెలుగు వారెందుకు అనుకున్నాడో ఏమో.. తెలుగు భామలను వదిలి అమెరికా భామలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చేశాడు. ముఖ్యంగా పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో వర్మ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. మియా మాల్కోవా వర్మ కాంబోలో గతంలో జీఎస్టీ అనే సినిమా వచ్చి ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాతోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది.

ఎంతమంది విమర్శించినా ఆ సినిమాను విడుదల చేశారు. అంతే కాకుండా ఆ ఫిల్మ్ చూసి అభినందించిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి బోల్డ్ తీయడం ఒక్క రామ్ గోపాల్ వర్మ వల్ల మాత్రమే అవుతుందని ఆయనను చాలామంది మెచ్చుకున్నారు. ఇక ఆ సినిమా తర్వాత అమెరికాలో ఇప్పుడే మియా మాల్కోవా కలవడం జరిగింది. ఇక వర్మను చూడగానే మియా మాల్కోవా ఆర్జీవీని బిగి కౌగిలిలో బిగించేసింది. వీరిద్దరూ హగ్ చేసుకుని మరోసారి జీఎస్టీ రోజులను గుర్తు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.