నేను డేటింగ్ లో ఉన్నాను. . తెలివిగా చెప్పిన కృతి శెట్టి

- Advertisement -

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తొలి చిత్రంతోనే కొంతమంది హీరోలైన, హీరోయిన్లైనా రాత్రికి రాత్రే స్టార్ హీరో హీరోయిన్లుగా మారిపోతుంటారు. మరి కొందరు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన అదృష్టం కలిసి రాక వాళ్ళు ఎంత అందంగా ఉన్నప్పటికీ వాళ్ల సినిమాలు హిట్ అవ్వక ఫ్లాప్ హీరోయిన్ గానే ముద్ర వేసుకుంటారు. ఇక వాళ్లందరి విషయం పక్కకు పెట్టినట్లయితే తన మొదటి సినిమా తోటే టాలీవుడ్ లో తానేంటో నిరూపించుకుని తెలుగు చిత్ర పరిశ్రమను ఏలేస్తుంది అనుకున్నారు. అలా అందరూ అనుకున్నట్టే ఆమె వరుసగా నటించిన మూడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ హీరోయిన్ కి ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

కృతి శెట్టి
కృతి శెట్టి

ఇలా వరుస సినిమాలు హిట్ అయిన తర్వాత వరుస ఆఫర్లతో చాలా బిజీ బిజీగా ఎన్నో చిత్రాల్లో అవకాశాలు లభించడంతో మళ్ళీ వరుసగా వచ్చిన మూడు చిత్రాల్లో నటించింది. కానీ అవి అనుకున్నంత ఫలితాన్ని కాదు కదా అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇక ఇటీవల మరొకచిత్రం విడుదల అయింది. ఆ చిత్రం కూడా ఆ ఫ్లాప్ దిశగానే అడుగులు వేస్తుంది. ఈ విషయం చెప్తుంటేనే మనకు అర్థమయిపోయి ఉండాలి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆమె ఉప్పెన చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కృతి శెట్టి.

kriti-shetty

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి తను యాంకర్ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని అడగగా.. కృతి శెట్టి చాలా తెలివిగా నేను సినిమాలతో ప్రేమ షూటింగ్ లతో డేటింగ్ చేస్తానంతే.. నేను ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు.. నా తల్లిదండ్రులను తప్ప.. అంటూ తెలిపింది. ప్రేమ చాలా స్వచ్ఛమైనది కానీ ఇప్పటివరకు నేను పొందిన ప్రేమ నా తల్లిదండ్రుల నుంచి పొందిన స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే.. కానీ నేను చదువుకునే రోజుల్లో చాలా లవ్ లెటర్స్ వచ్చాయి కానీ నేను వాటిని అంతగా పట్టించుకునే దాన్ని కాదు అంటూ కృతి శెట్టి తన ప్రేమ విషయాన్ని ఇంటర్వ్యూలో భాగంగా బయట పెట్టింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here