ఆ హీరో ని అర్థ నగ్నంగా చూడాలని ఉంది అంటూ హీరోయిన్ జెనీలియా షాకింగ్ కామెంట్స్

- Advertisement -

చేసింది తక్కువ సినిమాలే అయినా తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్రలాగ వేసిన హీరోయిన్స్ మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ హీరోయిన్ జెనీలియా. ‘తుజే మేరీ కసమ్’ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా తెలుగు లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన తరుణ్ ‘నువ్వే కావాలి’ చిత్రానికి రీమేక్. ఆ తర్వాత ఈమె తమిళం లో శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ అనే చిత్రం ద్వారా మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.

జెనీలియా
జెనీలియా

ఆ సినిమా తమిళం తో పాటుగా తెలుగు లో కూడా సూపర్ హిట్ అయ్యింది. అలా తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న జెనీలియా , తెలుగు లో ‘సత్యం’ అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్, ఇక ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా టాలీవుడ్ , కోలీవుడ్ మరియు బాలీవుడ్ ని కవర్ చేసి అన్ని చోట్ల భారీ బ్లాక్ బస్టర్స్ ని కొట్టి పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Genelia D'Souza

ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో ప్రముఖ యంగ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ని ప్రేమించి పెళ్ళాడి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఆమె రీ ఎంట్రీ ఇచ్చి అడపాదడపా మంచి పాత్రలు ఉన్న సినిమాలు చేస్తుంది. అయితే ఈమెకి బాలీవుడ్ లో ఇష్టమైన నటుడు జాన్ అబ్రహం అని పలుమార్లు ఇంటర్వ్యూస్ లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

- Advertisement -
ritesh deshmukh

అంతే కాదు అప్పట్లో ఈమె జాన్ అబ్రహం ని అర్థ నగ్నంగా, అంటే చొక్కా లేకుండా చూడాలని ఉంది అని కామెంట్ చేసిందంటూ మీడియా లో ఒక వార్త ప్రకంపనలు రేపింది. ఇదే విషయాన్నీ ఆమెని అప్పట్లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అడిగితే , దానికి ఆమె సమాధానం చెప్తూ ‘ఛీ ఛీ నేను అలా అనలేదు. మీడియా పర్సన్స్ కొంతమంది నా మాటలను ట్విస్ట్ చేసి చెప్పారు. జాన్ అబ్రహం నాకు చాలా మంచి స్నేహితుడు, నా ఫేవరెట్ కో స్టార్, అంత వరకు మాత్రమే’ అంటూ క్లారిటీ ఇచ్చింది జెనీలియా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here