అమల కోసం ఇళ్లు వదిలి పారిపోయిన అమ్మాయిలు.. తర్వాత ఏమైందంటే..!

- Advertisement -

దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి అమల. కెరీర్‌ ఆరంభంలోనే కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించిన ఆమె.. ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తూ వెండితెర వేదికగా వినోదం పంచుతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్‌లో వచ్చిన పలు చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అమల
అమల

1991లో తాను హీరోయిన్‌గా నటించిన ఓ సినిమా విడుదలయ్యాక.. కొంతమంది అమ్మాయిలు ఇంటి నుంచి పారిపోయి తన వద్దకు వచ్చేశారని ఆమె చెప్పారు. ‘‘మలయాళం చిత్ర పరిశ్రమ అనగానే నాకు ఒక సినిమా బాగా గుర్తుకు వచ్చేది. 1991లో ఇది విడుదలైంది. ఇందులో నా పాత్ర రెబల్‌గా ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక.. కేరళకు చెందిన పలువురు అమ్మాయిలు తమ ఇళ్ల నుంచి పారిపోయి చెన్నైలోని మా ఇంటికి వచ్చారు. నా రోల్‌ తమకెంతో నచ్చిందని.. తమలో స్ఫూర్తి నింపిందని చెప్పారు.

అలా, మొదటిసారి స్టార్‌డమ్‌ చూశా. నా పాత్ర వాళ్లను ఏవిధంగా ప్రేరేపితం చేసిందో తెలుసుకుని సంతోషించా. వాళ్లతో మాట్లాడి.. తిరిగి వాళ్లను సంక్షేమంగా ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పా. నా మేనేజర్‌ను వాళ్లకు తోడుగా పంపించా’’ అని అమల చెప్పారు. అనంతరం ఆమె.. కమల్‌హాసన్‌తో వర్క్‌ చేయడం వల్ల నటన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. రజనీకాంత్‌తో నటించిన వెలైక్కరన్ చిత్రంలోని ఓ పాటను మంచులో షూట్‌ చేశారని.. దాని వల్ల తన కాళ్లు వాచిపోయి, నడవడానికి కూడా కష్టపడ్డానని తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here