టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్… ఒకప్పటి హీరోయిన్ లేడీ ఫైర్ బ్రాండ్ రోజా మధ్య 25 సంవత్సరాలుగా మాటలు లేవన్న ప్రచారం ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది. అసలు దీనికి కారణం ఏంటి ? వీరిద్దరి మధ్య గొడవ వెనక ఏం జరిగింది అన్నది ఆసక్తికరమే. ఈ విషయాన్ని వెంకటేష్ మేకప్‌మ్యాన్ రాఘవ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వీరిద్దరి కాంబినేషన్లో పోకిరి రాజా అనే సినిమా వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత కొన్నాళ్లకు వెంకటేష్ హీరోగా రాజా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తమిళం నుంచి రీమేక్ చేశారు. తమిళ్ వెర్షన్ లో రోజా హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని ముందుగా అనుకున్నారు. ఆ విషయాన్ని రోజా దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో వెంకటేష్ పక్కన తానే హీరోయిన్ అని రోజా ఫిక్స్ అయిపోయారు. అప్పట్లో వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్లో వరుసగా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
దీంతో దర్శక, నిర్మాతలు మార్కెట్ పరంగా వెంకటేష్ – సౌందర్య జోడికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సౌందర్యను హీరోయిన్గా తీసుకున్నారు. అయితే కావాలనే వెంకటేష్ తనను తప్పించి సౌందర్యను హీరోయిన్గా పెట్టుకోవాలని దర్శక, నిర్మాతలకు చెప్పినట్టు రోజా ఫీల్ అయ్యారట. అయితే వాస్తవంగా ఈ విషయంలో వెంకటేష్‌కు ఏమాత్రం సంబంధం లేదని రాఘవ చెప్పారు.
ఆ తర్వాత కొన్ని సినిమా ఫంక్షన్లో వెంకటేష్ పక్కన కూర్చునేందుకు కూడా రోజా ఇష్టపడలేదు. అలా వారిద్దరి మధ్య అనుకోకుండా గ్యాప్ పెరిగిందని… దీనికి తోడు మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు కూడా వారిద్దరి మధ్య గ్యాప్ మరింత పెంచాయని రాఘవ చెప్పారు. ఆ తర్వాత వెంకటేష్ – రోజా కాంబినేషన్లో సినిమాలు రాలేదు. ఇప్పుడు వీళ్లిద్దదూ ఫ్రెండ్స్ అయ్యారనుకోండి.