‘స్పై’ 2 రోజుల వసూళ్లు..నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్

- Advertisement -

గత ఏడాది యంగ్ హీరో నిఖిల్ ‘కార్తికేయ 2 ‘ చిత్రం తో పాన్ ఇండియన్ లెవెల్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టిన తర్వాత ఆయనకీ గడ్డు కాలం ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ’18 పేజెస్’ అనే చిత్రం ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా ఆడలేదు. ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘స్పై’ అనే చిత్రం కూడా రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుంది.

స్పై
స్పై

అయితే బక్రీద్ పర్వదినం ని పురస్కరించుకొని విడుదల చేసిన సినిమా కావడం తో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కళ్ళు చెదిరే రేంజ్ లో వచ్చాయి. మొదటి రోజు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 10 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ రెండవ రోజు మాత్రం అన్నీ ప్రాంతాలలో 70 శాతం కి పైగా డ్రాప్స్ పడ్డాయి.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అటు ఇటుగా మూడు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టుగా చెప్తున్నారు. పది కోట్ల రూపాయిల గ్రాస్ ఎక్కడా, మూడు కోట్ల రూపాయిల గ్రాస్ ఎక్కడ?. ఈ మూడు కోట్ల రూపాయిల గ్రాస్ కి గాని కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు చెప్తున్నారు.

- Advertisement -

మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు కనీసం 70 శాతం హోల్డ్ ని కొనసాగించగలిగితే మంచి ట్రెండ్ అని అంటారు. కానీ 70 శాతం డ్రాప్స్ అంటే మాత్రం డిజాస్టర్ సినిమా అన్నట్టే లెక్క. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 17 కోట్ల రూపాయలకు జరిగింది. వీకెండ్ కనీస స్థాయిలో అయినా నిలబడితే యావరేజి గా అయినా నిలుస్తుంది. చూడాలి మరి ఏ రేంజ్ కి ఈ సినిమా ఎల్తుంది అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here