రామ్ చరణ్ కూతురు పేరు క్లిన్ కారా కి పవన్ కళ్యాణ్ పేరు మధ్య ఉన్న తేడా ఇదేనా..? ఎవ్వరూ గమనించలేదుగా!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు రీసెంట్ గానే ఒక ఆడబిడ్డకు జన్మని ఇచ్చిన సంగతి తెలిసిందే. పెళ్ళైన 11 ఏళ్లకు వీళ్లిద్దరికీ పాప పుట్టడం తో మెగా ఫ్యామిలీ సంతోషం లో మునిగి తేలుతుంది. ఇక అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, తమ అభిమాన హీరో కి సంబంధించి చిన్న మంచి విషయం జరిగినా సంబరాలు చేసుకునే ఫ్యాన్స్, ఇంత గొప్ప వార్త విన్న తర్వాత ఊరుకుంటారా.

రామ్ చరణ్
రామ్ చరణ్

రామ్ చరణ్ వాళ్ళు చూపించిన ప్రేమకి ముగ్దుడై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ధన్యవాదాలు తెలియచేసాడు. ఇక నిన్ననే రామ్ చరణ్ తన కూతురుకి ఉయ్యాలా ఫంక్షన్ ని ఏర్పాటు చేసి, ఆ చిన్నారికి క్లిన్ కారా అనే నామకరణం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. లలిత సహస్ర నామాల్లో నుండి ఈ పేరుని తీసుకున్నట్టుగా చిరంజీవి చెప్పుకొచ్చాడు.

అయితే ఈ పేరుకి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియా లో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు అతని అసలు పేరు ‘కొణిదెల కళ్యాణ్ కుమార్’. కానీ ఇంట్లో అందరూ కళ్యాణ్ బాబు అని పిలిచేవాళ్ళు. కొణిదెల కళ్యాణ్ కుమార్ లలో మూడు పదాలలో మొదటి అక్షరం ‘K’ తో ప్రారంభం అవుతుంది. అంటే ‘KKK’ అన్నమాట, ఇక రామ్ చరణ్ కూతురు పేరు ‘కొణిదెల క్లిన్ కారా’ లో కూడా మూడు పదాలు ఉన్నాయి.

- Advertisement -

ఈ మూడు పదాల్లో కూడా మొదటి అక్షరం ‘K’ తోనే ప్రారంభం అవుతుంది. అలా ఇద్దరి పేర్లు కామన్ గా ఉంది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో పోల్చి చూస్తున్నారు. ఇక ఇన్ని రోజులు వారాహి విజయ యాత్ర పర్యటన లో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ నేడు కానీ, లేదా రేపు కానీ రామ్ చరణ్ ఉపాసన బిడ్డని చూడబోతున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here