రామ్ చరణ్ కూతురి పేరు ‘క్లిన్ క్లారా కొణిదెల’..ఈ విచిత్రమైన పేరులో ఇంత అర్థం ఉందా!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన కొణిదెల రీసెంట్ గానే ఒక ఆడబిడ్డకు జన్మని ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్ళై సుమారుగా 12 ఏళ్ళ తర్వాత వీళ్లకు సంతానం కలగడం తో అటు చిరంజీవి కుటుంబ సబ్యులకు ఇటు మెగా అభిమానులు గత కొద్దీ రోజుల నుండి పండుగ చేసుకుంటున్నారు. అయితే పుట్టిన పాప కి ఏమి పేరు పెడుతున్నారు అనే దానిపై సోషల్ మీడియా లో రకరకాల పేర్లు ప్రచారం అయ్యాయి.

కచ్చితంగా సాధారణ పేరు, అందరూ పలకగలిగే పేరునే పెడతారని అనుకున్నారు. కానీ ఎవ్వరి అంచనాలకు అందకుండా ‘క్లిన్ క్లారా కొణిదెల’ అని నామకరణం చేసారు. ఇదేమి విచిత్రమైన పేరు అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇది మన తెలుగు భాషకి సంబంధించిన పేరు కాదు కదా అని కూడా అనుకున్నారు. కానీ ఈ పేరు వెనుక ఉన్న అసలు అర్థం చూస్తే ఆశ్చర్యపోతారు.

‘క్లిన్ క్లారా కొణిదెల’ అనే పేరు ని లలిత సహస్రనామం నుండి తీసుకున్నారట. క్లిన్ క్లారా అంటే ఒక అద్వితీయమైన శక్తి. ఈ శక్తి మనిషి లో ‘ఆధ్యాత్మికత’ ని పెంచి పరిపూర్ణంగా ఉండేలా చూస్తుంది. ఈ విషయాన్నీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మా చిన్నారి తల్లికి ఆ పేరులో ఉన్న లక్షణాలు తన వ్యక్తిత్వం లో కూడా పెరిగే కొద్దీ వస్తుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి.

- Advertisement -

దీంతో అప్పటి వరకు అర్థం తెలియక సతమతం అవుతున్న అభిమానులు, దీని అర్థం తెలుసుకొని అద్భుతమైన పేరు అని కొనియాడారు. ఇక ఈరోజు బిడ్డని ఉయ్యాలలో వేసిన శుభకార్యక్రమం కి మెగా కుటుంబం మొత్తం హాజరు అయ్యింది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వారాహి విజయ యాత్ర పర్యటన కారణం గా హాజరు కాలేకపోయాడు. మ్నుఖ్యమైన శుభకార్యం లో పవన్ కళ్యాణ్ లేడే అని అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here