తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ కీర్తి సురేష్. తాజాగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే కీర్తి సురేష్ కుటుంబంలో ఆమె తల్లి కూడా ఒక హీరోయిన్ అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఈమె తల్లి మేనక 1980 లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా సౌత్ ని ఏలిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మలయాళం ,తమిళ్ వంటి పరిశ్రమలో కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించింది ఈమె.
1980లో విడుదలైన రాయయి వయసుక్కు వాన్ తుట్ట వంటి తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.ఇక అక్కడ నుంచి ఆమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఏడాదికి 20 సినిమాలు విడుదల చేసిన ఘనత ఆమె సొంతం చేసుకుంది. కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో డైరెక్టర్ జి. సురేష్ కుమార్ తో మేనకా ప్రేమలో పడి 1987లో వివాహం చేసుకున్నారు భర్త కోసం తన కెరీర్ ని కూడా వదులుకుంది మేనకా. ఇక మేనక వివాహం జరిగిన ఏడాదికే ఆమె నటించిన చిత్రాలు ఆరు విడుదలయ్యాయి.
అందులో కేవలం రెండు చిత్రాలు మాత్రమే ఈమె తెలుగులో నటించింది 1980 ల విడుదలైన పున్నమినాగు 1982లో వచ్చిన సుబ్బారావుకి కోపం వచ్చింది వంటి చిత్రాలలో నటించింది. పున్నమినాగు చిత్రంలో నెగిటివ్ సేడ్స్ ఉన్న పాత్రలో నటించి చిరంజీవి కెరీర్ ఎదుగుదలకు పునాదివేసింది ఈమె. ఇక చిరంజీవి కి మేనకా హీరోయిన్గా నటిస్తే ప్రస్తుతం కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తూ ఉన్నది. కీర్తి సురేష్ నటించిన చిత్రాల విషయానికి వస్తే భోళా శంకర్ లో నటిస్తోంది.
ఇక తల్లి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని కీర్తి సురేష్ నటన వైపు అడుగులు వేసింది. కీర్తి ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అంటే అందుకే ఆమె తల్లి కృషి ఎంతో ఉంది. అయితే కీర్తి సురేష్ నటించిన సినిమాల్లో ఆమె తల్లికి బాగా ఇష్టమైన మూవీ మహానటి
అట. ఈ విషయాన్ని మేనక సురేష్ స్వయంగా వెల్లడించారు. అదే సమయంలో కీర్తి కెరీర్ లో తనకు నచ్చని సినిమా ఏదో కూడా మేనక రివీల్ చేసింది. అదే పెంగ్విన్
. తెలుగులో కీర్తి సురేష్ చాలా చెత్తగా నటించిన సినిమా అదే అంటూ మేనక పేర్కొంది. పెంగ్విన్ మూవీలో కీర్తి నటన తనకు అస్సలు నచ్చలేదని మేనక కుండబద్దలు కొట్టేసింది. కాగా, కరోనా టైమ్ లో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాలో కీర్తి ఒక బిడ్డకు తల్లిగా నటించింది. ఈ మూవీ ఓటీటీలోనూ డిజాస్టర్ అయింది.